Chiranjeevi Muthyala Subbaiah : చిరంజీవి కి ఆ స్టార్ డైరెక్టర్ కి మధ్య తలెత్తిన విబేధాలు ఇవే..వాళ్ళు ఇప్పటికీ మాట్లాడుకోవడం లేదు..

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) ఎంత పెద్ద నటుడో మనందరికీ తెలిసిందే.

ఈయన చేసిన సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి.

ఇక ఇది ఇక ఉంటే ఒక సామాన్య మానవుడు కూడా మెగాస్టార్ రేంజ్ ను అధిరోహించవచ్చు అనే ఉద్దేశ్యంతో చిరంజీవిని చూసిన ప్రతి ఒక్కరు అయన ఇన్స్పిరేషన్ గా తీసుకొని ముందుకు సాగే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.ఇక ఇలాంటి క్రమం లోనే ఆయన సినిమా ఇండస్ట్రీకి చేసిన సేవలు కూడా చాలా గొప్పగా ఉన్నాయనే చెప్పాలి.

ఆయన లాంటి హీరో మరొకరు ఇండస్ట్రీలో లేరు అని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇప్పటికి కూడా ఆయన యంగ్ హీరోలతో సైతం పోటీపడి 70 సంవత్సరాల వయసులో తనకంటూ ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకోవాలని వర్క్ చేస్తున్నాడు అంటే ఆయన డెడికేషన్ ని మనం తక్కువ అంచనా వేయలేం.

అలాగే ఆయన చేస్తున్న ఈ సినిమాల పరంపరలో తనని తాను ఎప్పుడూ కూడా స్టార్ గా చూసుకోకుండా ఎప్పుడు ఒక కొత్త నటుడి గా చేస్తూ నటిస్తూ ఉంటాడు.కాబట్టే ఆయన క్యారెక్టర్ లో ఎప్పుడు ఆయన సినిమాల్లో చాలా ఫ్రెష్ నెస్అనేది కనిపిస్తూ ఉంటుంది.ఇక అందులో భాగంగానే చిరంజీవి ఒకప్పుడు ఒక స్టార్ డైరెక్టర్ తో( Star Director ) గొడవపడిన విషయం చాలామందికి తెలియదు.

Advertisement

ఆయన ఎవరు అంటే ముత్యాల సుబ్బయ్య( Muthyala Subbaiah ) డైరెక్షన్ లో హిట్లర్,( Hitler Movie ) అన్నయ్య( Annayya Movie ) అనే రెండు సినిమాలు చేశాడు.ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయాలను అందుకున్నాయి.

ఇక ఈ క్రమంలోనే చిరంజీవి,ముత్యాల సుబ్బయ్యకు మధ్య గొడవలు జరిగినట్టుగా అప్పట్లో చాలా వార్తలైతే వచ్చాయి.ఇక దాంతో వీళ్ళ మధ్య మాటలు కూడా లేవని చాలా మంది చెబుతూ ఉంటారు.ఇప్పటికి కూడా వీళ్ళ కాంబినేషన్ లో మరొక సినిమా రాలేదు దానివల్ల ఇద్దరి మధ్య తగాదాలు ఉన్నట్టుగా తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు