సినిమాల కోసం ఆస్తులను సైతం అమ్ముకున్న సెలబ్రిటీలు వీళ్లే.. సినిమాలంటే ఇంత ప్రేమా?

మామూలుగా చాలామందికి ఒక్కొక్క రంగం అంటే పిచ్చి ఇంట్రెస్ట్ ఉంటుంది.అలా చాలామందికి సినిమా రంగం అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది.

సినిమాలలోకి ఎంట్రీ ఇవ్వాలి.ఒకసారైనా తెరపై కనిపించాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు.

కొంతమంది సినిమాలపై ఉన్న మక్కువతో అనేక రకాల స్టంట్ లు కూడా చేస్తూ ఉంటారు.అలా చాలామంది హీరోలు కూడా కొన్ని భయంకరమైన స్టంట్ లి చేసి ప్రాణాలకు తెగించి మరి సినిమాలపై వారికి ఉన్న పిచ్చి నిరూపించుకున్నారు.

అలా ఇప్పటికి ఎన్నో రకాల సంఘటనలు జరిగిన విషయం తెలిసిందే.

Advertisement

అయితే కొంతమంది దర్శకులు సినిమాలపై ఉన్న పిచ్చితో ఏకంగా వారి ఆస్తిపాస్తులను అమ్మేసి మరి సినిమాలను తెరకెక్కించారట.ఇంతకీ ఆ సినిమాలు ఏవి? ఆ దర్శకులు ఎవరు అన్న విషయానికి వస్తే.దర్శకుడు సందీప్ రెడ్డి వంగా( Sandeep Reddy Vanga ) అర్జున్ రెడ్డి సినిమాను తెరకెక్కించడానికి ఏ నిర్మాత కూడా ముందుకు రాకపోవడంతో సందీప్ ఫ్యామిలీ అందరూ కలిసి నిర్ణయం తీసుకొని వారికి ఉన్న 36 ఎకరాల మామిడి తోటను అమ్మేసి మరి ఈ సినిమాను తెరకెక్కించారు.

ఈ సినిమా విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.

అలాగే పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్( Director Prashanth Neel ) తన మొదటి సినిమా ఉగ్రం సినిమాను రూపొందించాలి అనుకున్నప్పుడు నిర్మాతలు ఎవరు ముందుకు రాకపోవడంతో తన సొంత ఇంటిని అమ్మేసి మరి ఈ సినిమాను తెరకెక్కించగా ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది.అలాగే బేబీ సినిమాలో నిర్మించాలి అనుకున్న ఎస్కేఎన్ డబ్బులు సరిపోకపోవడంతో గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న తన ఇంటిని అమ్మేసి మరి ఈ సినిమాను తెరకెక్కించారు.ఈ సినిమా విడుదల అయ్యి అంతకు రెండింతలు విజయాన్ని సాధించి మంచి కలెక్షన్లను తెచ్చిపెట్టింది.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు