కాంతివంతమైన ముఖ చర్మం కోసం ఆయుర్వేద చర్మ చిట్కాలు ఇవే..!

ఆయుర్వేదం( Ayurveda ) అనేది పురాతన భారతీయ వైద్య విధానం అని దాదాపు చాలా మందికి తెలుసు.

ఇది అందమైన చర్మంతో సహా మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి వేల సంవత్సరాలుగా అనుసరిస్తూ ఉన్న విధానం అని చెబుతున్నారు.

స్పష్టమైన కాంతివంతమైన చర్మం,చంద్రబింబం లాంటి ముఖ సౌందర్యం కోసం ఆయుర్వేద చర్మ సంరక్షణ రహస్యాలు కొన్ని ఉన్నాయి.అలాంటి రహస్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

యాంటీ ఫంగల్ ( Anti-fungal )లక్షణాల కారణంగా వేపను ఆయుర్వేదం చాలా కాలంగా ఉపయోగిస్తూ ఉంది.కొన్ని వేపాకులను నీటిలో వేసి మరిగించి ఆ ద్రవాన్ని ముఖం క్లెన్సర్‌ గా ఉపయోగించవచ్చు.

ఇది మొటిమలను ( Pimples )వదిలించుకోవడానికి ఎంత గానో ఉపయోగపడుతుంది.అంతే కాకుండా అలోవెరా జెల్( Aloe vera gel ) దాని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల కారణంగా వివిధ చర్మ సమస్యలకు చికిత్స చేయడానికి అత్యంత ప్రభావంతమైన ఆయుర్వేద రెమిడిగా కొన్ని అధ్యనాలు చెబుతున్నాయి.ఈ ఆకుల నుంచి నేరుగా జెల్ ను తీసి ఉపయోగించవచ్చు.

Advertisement

దాన్ని అలాగే చర్మం పై 15 నిమిషములు వదిలేసి ఆ తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.దీనితో ముఖంలో త్వరగా మార్పు కనిపిస్తుంది.ముఖానికి ఒక చెంచా పచ్చి తేనే,( Honey ) ఒక టేబుల్ స్పూన్ పసుపుతో కలిపి ముఖానికి రాయాలి.

ఇది పది నుంచి 15 నిమిషముల వరకు పూర్తిగా అరనివ్వాలి.

ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. తేనే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గా కూడా పని చేస్తుంది.ఇంకా చెప్పాలంటే రోజ్ వాటర్ యాంటీ బ్యాక్టీరియా లక్షణాలను కలిగి ఉంటుంది.

తరతరాలుగా చర్మానికి ఉపశమనం పోషణకు ఇది ఉపయోగించవచ్చు.మీరు ఈ చర్మాన్ని శుభ్రం చేసిన తర్వాత కాటన్ బాల్స్ సాయంతో ముఖానికి రోజ్ వాటర్ అప్లై చేయాలి.

ఫ్రీ టైమ్‌లో నన్ను చూసి నేను ప్రౌడ్‌గా ఫీల్ అవుతా : నాని
ఆ మూవీ విషయంలో చేసిన తప్పే ఇప్పుడు చేస్తున్న నాని.. ఇంత నిడివి అవసరమా అంటూ?

అలాగే గంధపు పొడి,( Sandalwood powder ) రోజ్ వాటర్ కలిపి పేస్టులా చేసి మీ మొహానికి అప్లై చేయవచ్చు.దీన్ని పది నుంచి 15 నిమిషాలు బాగా ఆగిపోయిన తర్వాత గురు వేచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

Advertisement

ఈ ప్యాక్ మీకు చికాకు, ఎరుపును తగ్గించడం ద్వారా చర్మపు రంగును మెరుగుపరుస్తుంది.

తాజా వార్తలు