Double iSmart Movie: ఒక్క సినిమా.. ముగ్గురి కెరీర్.. వర్క్ అవుట్ చేస్తారా ?

సినిమా అంటేనే కత్తి మీద సాము.అందరికి ఈజీ గా అది వర్క్ అవుట్ కాదు.

ఒక్క సినిమా పోతే మరొక సినిమా అనే విధంగా ప్రస్తుతం ఉన్న సినిమా ఇండస్ట్రీ లేదు.ఒక్కసారి పోతే మళ్లి అవకాశం దొరుకుతుంది అని నమ్మకం లేదు.

అందుకే సినిమా హిట్ కావాలని అందరు కోరుకుంటారు.ఇప్పుడు ఒక్క సినిమా ముగ్గురు స్టార్స్ భవిష్యత్తు ను నిర్ణయించబోతుంది.

ఆ సినిమా ఏంటి ? ఈ సినిమా పోతే ప్రశ్నార్ధకం గా మారే ఆ ముగ్గురు ఎవరో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.ఇంతకు ఆ సినిమా ఏంటి డబల్ ఇస్మార్ట్.

Advertisement

( Double iSmart Movie ) పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇంతకు ముందు ఇష్మార్ట్ శంకర్( Ismart Shankar ) చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కుతుంది.చాల సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

ఈ సినిమాకు ఇప్పటి వరకు హీరోయిన్ ఎవరు అనే విషయం ఎక్కడ లీక్ కాకుండా మ్యానేజ్ చేస్తున్నారు.

రామ్ పోతినేని

తాజాగా స్కంద సినిమాతో పర్వాలేదు అనిపించుకున్న రామ్ పోతినేని( Ram Pothineni ) ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత రెడ్ మరియు ది వారియర్ సినిమాల్లో నటించగా, రెడ్ పర్వాలేదు అనిపించుకుంది కానీ ది వారియర్ మాత్రం డిజాస్టర్ అయ్యింది.ఇప్పుడు స్కంద కూడా క్లీన్ హిట్ కాలేదు.దీంతో రామ్ పోతినేని పరిస్థితి డోలాయమానం లో పడిపోయింది.

ఇక రామ్ ఆశలన్నీ కూడా డబల్ ఇస్మార్ట్ పైననే పెట్టుకున్నాడు.

మణిశర్మ

Dandruff Homemade Serum : ఈ హోమ్‌ మేడ్ సీర‌మ్ ను వాడితే డాండ్రఫ్ అన్న మాటే అన‌రు!

ఇస్మార్ట్ శంకర్ కి సంగీతం అందించిన మణిశర్మ ( Manisharma ) ఆ తర్వాత దాదాపు 2021 లో 12 సినిమాలకు సంగీతం అందించాడు.అందులో ఆచార్య, శాకుంతలం వంటి పెద్ద సినిమాలు కూడా ఉన్నాయ్.కానీ అన్ని పరాజయాలు కావడం తో ప్రస్తుతం మణిశర్మ చేతిలో పెద్దగా సినిమాలు లేవు.

Advertisement

తాజాగా బెదురులంక తో కూడా నిరాశ పరిచిన మణిశర్మ డబల్ ఇస్మార్ట్ కి కూడా సంగీతం ఇస్తున్నాడు.మరి ఈ సినిమా పాటలు బాగోలేకపోతే మణిశర్మ గ్రాఫ్ బాగా పడిపోయే అవకాశం ఉంది.

పూరి జగన్నాధ్

లైగర్ వంటి సినిమా పరాజయం తర్వాత కోలుకొని పూరి డబల్ ఇస్మార్ట్ షూటింగ్ మొదలు పెట్టాడు.ఇక పూరి( Director Puri Jagannath ) కెరీర్ మొదటి నుంచి ఎన్నో ఎత్తు పల్లాలతో కొనసాగుతుంది.మరి ఈ సినిమ కూడా ప్రస్తుతం పూరికి అగ్ని పరీక్షా లాంటిదే.

తాజా వార్తలు