అక్కడ మోదీ ఇక్కడ మేము ! చంద్రబాబు ఇంకేమన్నారంటే ?

మూడోసారి ప్రధాని మంత్రిగా నరేంద్ర మోది( Narendra Modi ) బాధ్యతలు స్వీకరిస్తారని టిడిపి అధినేత చంద్రబాబు జోష్యం చెప్పారు.

  అలాగే ఏపీలో టీడీపీ,  జనసేన,  బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని , ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ రావడం గ్యారెంటీ అంటూ చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు .

తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రసంగించిన చంద్రబాబు,  వైసీపీ అధినేత,  ఏపీ సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.  ఏపీలో మూడు పార్టీల కూటమి విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో కళకళలాడుతోందని వైసిపి మ్యానిఫెస్టో బంగాళాఖాతంలో కలిసిపోతుందని ,  జగన్ పార్టీకి డిపాజిట్లు కూడా గల్లంతు అవుతాయని,  ఢిల్లీలో మోది కూర్చుంటే , ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు తీరుతుందని చంద్రబాబు అన్నారు .

There Is Modi Here We Are What Else Did Chandrababu Say, Chandrababu, Jagan, Ap

ప్రజాగళం మేనిఫెస్టో , సూపర్ సిక్స్ లకు ప్రజల నుంచి ఊహించని స్థాయిలో స్పందన వస్తోందని , మీ ఉత్సాహం చూస్తుంటే తనకు ఇప్పుడే పండగ వచ్చినంత ఆనందంగా ఉందని చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) అన్నారు.పవన్ కళ్యాణ్ కు నెల్లూరు ఎంతో తనకు తిరుపతి అంతే అని , ఇక్కడే పుట్టి పెరిగానని , తిరుపతిలో గల్లి గల్లి లో తిరిగి తాను ఎస్ వి యూనివర్సిటీలో విద్యార్థి సంఘం నాయకుడిని అయ్యానని చంద్రబాబు పాత సంగతులను గుర్తు చేసుకున్నారు.  తాను విద్యార్థి సంఘం నాయకుడిగా పనిచేసి తరువాత రాజకీయాల్లోకి తిరుపతి నుంచే ఎంట్రీ ఇచ్చానని,  ఈరోజు మీ ఆశీస్సులు,  వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో తాను ఇంతటి వాడిని అయ్యానని , తాను ఈ స్థాయిలో ఉన్నాను అంటే అది తిరుమల వెంకటేశ్వర స్వామి దయ , మీ ఆదరణ అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.

తిరుపతి రుణం తీర్చుకోవడానికి తనకు త్వరలో అవకాశం వస్తుందని ఎదురు చూస్తున్నానని ఆయన అన్నారు.

There Is Modi Here We Are What Else Did Chandrababu Say, Chandrababu, Jagan, Ap
Advertisement
There Is Modi Here We Are What Else Did Chandrababu Say, Chandrababu, Jagan, Ap

  ఏపీలో ఇదే నెల 13న జరిగే కురుక్షేత్ర యుద్ధంలో కౌరవ వాద తప్పదని,  తర్వాత ఏపీ ప్రజలకు అంతా మంచే జరుగుతుందని చంద్రబాబు అన్నారు  నేను పుట్టిన స్థానం తిరుపతి , నేను పెరిగిన స్థానం తిరుపతి .నాకు విద్యార్థి నాయకుడిగా బిక్ష పెట్టింది తిరుపతి.తనకు పునర్జన్మ ఇచ్చింది ఇదే తిరుపతి.

  పవన్ కళ్యాణ్ కు కూడా తిరుపతి సెంటిమెంట్ అని,  ఇప్పుడు ఇద్దరూ ఇదే తిరుపతికి వచ్చామని,  ఇద్దరు కలిసి తిరుపతి, తిరుమల పవిత్రతను కాపాడుతామని చంద్రబాబు అన్నారు.

Advertisement

తాజా వార్తలు