వీడియో: ముసలోళ్లే కానీ దాండియా డ్యాన్స్ ఇరగదీసేశారు..

ప్రస్తుతం భారత దేశంలో దసరా సెలెబ్రేషన్స్ ఆకాశాన్ని అంటుతున్నాయి.రాత్రిలో ఉత్సవాల్లో చాలామంది భక్తులు ఆనందంగా డాన్సులు చేస్తున్నారు.

దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఈ నేపథ్యంలోనే ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అందులో ఒక వృద్ధ దంపతులు అద్భుతంగా గర్బా/దాండియా డ్యాన్స్ ( Garba/Dandiya Dance )చేస్తున్నారు.వీళ్లు ఎంతో ఆనందంగా, చక్కగా నర్తిస్తున్నారు.

ఈ కపుల్ నృత్యం చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు.ఈ వీడియోని ఒక సెలబ్రిటీ ( Celebrity )తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.కొన్ని రోజుల్లోనే దీన్ని కోట్ల మంది చూశారు.

Advertisement

"నవరాత్రి మా గుజరాతీలకు ఒక పండుగ మాత్రమే కాదు, అది మా హృదయానికి ఎంతో దగ్గరైనది.ఈ క్షణాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి” అని సెలబ్రిటీ శ్రీ శాహ్ ( Shri Shah )తన పోస్ట్‌లో రాశారు.

వీళ్ల నృత్యం చూసిన ప్రజలు ఎంతో ఆనందించారు.చాలామంది వీళ్లను ప్రశంసించారు.ఒకరు “వారికి నా ప్రేమను తెలియజేయండి.

డాన్స్ ఫ్లోర్‌పై వాళ్ళు ఎంతో అద్భుతంగా ఉన్నారు” అని కామెంట్ చేశారు.మరొకరు “ఆ నైట్ వాళ్ళే స్టార్స్” అని కామెంట్ చేశారు.

ఈ కపుల్ డ్యాన్స్ చూసిన చాలామంది వావ్ అన్నారు.ఒకరు, "వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే" అని అన్నారు.

ఈ ఎగ్ మాస్క్ తో స్పాట్ లెస్ అండ్‌ వైట్ స్కిన్ పొందొచ్చు.. తెలుసా?
కరెంట్ తీగలపై కోతి పిల్ల డేంజరస్ స్టంట్స్‌.. తల్లి ఏం చేసిందంటే..

మరొకరు, "వారిద్దరికీ చాలా శక్తి ఉంది.వారు ఆరోగ్యంగా ఉండటానికి ప్రతిరోజూ డాన్స్ చేస్తారని స్పష్టంగా తెలుస్తుంది" అని అన్నారు.

Advertisement

మరొకరు, "ఈ సూపర్ ఎనర్జిటిక్ తాత, అమ్మమ్మతో ఈ నవరాత్రి వేడుక అద్భుతంగా ఉంది" అని కామెంట్ చేశారు.ఈ హ్యాపీ కపుల్ మనకు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

అదేమిటంటే జీవితంలో ఆనందాన్ని ఆస్వాదించడానికి వయసు అనేది లేదు.

తాజా వార్తలు