తేనెలో ఇంత 'చేదు' ఉందా...?

తేనె అనగానే అందరూ అమృతం అన్నట్టుగా ఫీలింగ్ ఇస్తుంటారు.బరువు తగ్గాలనుకునే వాళ్లకు ఇది మంచి ఔషధం అని అందరూ అనుకుంటూ ఉంటారు.

గ్రీకులైతే స్వయానా ఆ దేవుడే దానిని భూమ్మీదకు తీసుకొచ్చాడని నమ్ముతారు.కానీ, ఆ అమృతం అంత మంచిది కాదంటున్నారు అమెరికా సైంటిస్టులు.

చక్కెర కన్నా తేనె చాలా తియ్యగా ఉంటుందట.

చక్కెర కన్నా తక్కువగా వేసుకున్నా, దానికి సమానంగానే తేనేలో తీపి ఉంటుందని వారు తెలిపారు.తేనెలో కేలరీలు కూడా ఎక్కువేనని దీంతో బరువు కూడా పెరుగుతారని చెప్పారు.ఇక దానిని లిక్విడ్‌ గోల్డ్‌ అనడం కరెక్ట్ కాదని, మతిమరుపుకు, సంతానలేమికి అది మందు కాలేదని స్టాన్ ఫోర్డ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌ సైంటిస్ట్‌‌ రాస్గన్‌ చెప్పారు.

Advertisement
Bets 10 Bonuses And Promotions : A Practical Welcome Bonus Breakdown
Advertisement