ఆరేళ్ల పిల్లాడు ఆటలాడుకుంటూ ఏడాదికి 70కోట్లు సంపాదిస్తున్నాడు..

పిట్ట కొంచెం కూత ఘనం అంటే ఇదేనేమో.ఆరేళ్ల పిల్లాడు కోట్లు సంపాదిస్తున్నాడంటే ఎవరైనా నమ్ముతారా?కానీ నమ్మి తీరాలి.

రియాన్ అనే ఆరేళ్ళ బుడతడి సంవత్సర ఆదాయం 71కోట్లు.

ఈ డబ్బు సంపాదించడానికి పాపం బిడ్డ ఎంత కష్టపడుతున్నాడో అనుకుంటున్నారా.కానీ మనోడు ఎంచక్కా బొమ్మలతో ఆడుకుంటూ ఇంత సంపాదిస్తున్నాడు.బొమ్మలతో ఆటలాడుకుంటూ రివ్యూలను ఇవ్వడమే రియాన్ పని.

రియాన్ వాళ్ల అమ్మ చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మల రివ్యూ ఛానెల్ లో వర్క్ చేస్తుంటుంది.అయితే ఒకరోజు రియాన్ తోనే రివ్యూలు ఇప్పిస్తే ఎలా ఉంటుందని ఆలోచన వచ్చింది.ఆలోచన వచ్చిందే తడవుగా కొడుకు చేతికి ఒక బొమ్మ ఇచ్చి ఆడుకోమని చెప్పింది.

అంతేకాదు.ఆ బొమ్మ ఎలా ఉంటే బావుంటుంది.

Advertisement

అందులో నీకు ఏం నచ్చాయో చెప్పు అని అడిగింది.చిన్నపిల్లలకు నచ్చేవి బొమ్మలు వాటితో ఆడుకోమని చెప్తే ఎగిరి గంతేస్తారు.

రియాన్ కూడా అంతే బొమ్మతో ఆడుకుంటూ అందులో తనకేం నచ్చాయో టక టక చెప్పేశాడు.

తనకు నచ్చిన విషయాల గురించి చెప్పిన రియాన్ వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేసింది.ఆ వీడియో వ్యూప్స్ 10 మిలియన్లు దాటింది.కొడుకు వీడియోకి వచ్చిన స్పందనకి రియాన్ తల్లి ఆశ్చర్యపోయింది.

అంతే ఆ తరువాత వెనక్కి తిరిగి చూడలేదు.‘రియాన్‌ టాయ్స్‌ రివ్యూ’ అంటూ ఒక ఛానెల్ పెట్టింది, బ్రాండ్ వాల్యూ పెరిగింది.

పచ్చి కొబ్బరి తినడం వల్ల ఆరోగ్యానికి లాభాలు అన్ని ఉన్నాయా..

‘రియాన్‌ టాయ్స్‌ అనే ఛానెల్ కి అతి తక్కువ కాలంలోనే అభిమానులు పెరిగిపోయారు.దీంతో అతని సంపాదన 2017 లో 11 వేల మిలియన్ డాలర్లు దాటింది.

Advertisement

అంటే 71 కోట్ల రూపాయలు.ఇప్పుడు అతనికి 14 మిలియన్ల సబ్ స్క్రైబర్స్ ఉన్నారు.

తాజా వార్తలు