జగన్ జనం బాట .. షెడ్యూల్ రెడీ 

ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో( AP general elections ) వైసిపి ఘోరంగా ఓటమి చెందడం,  టిడిపి, జనసేన , బిజెపి( TDP, Janasena, BJP ) కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.2019 ఎన్నికల్లో 151 సీట్లను గెలుచుకున్న వైసీపీ మొన్న జరిగిన ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం కావడాన్ని ఆ పార్టీ నేతలు ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏపీలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేసినా జనం ఇంత దారుణమైన తీర్పును ఇవ్వడాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నారు.

ఎన్నికలకు ముందు నుంచి వై నాట్ 175 అనే నినాదాన్ని వినిపిస్తూ వచ్చిన జగన్ ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు తమదే విజయమని , కనీసం 160 స్థానాల్లోనైనా వైసీపీ జెండా ఎగురుతుందని అంచనా వేశారు.

కానీ ఫలితాలు ఆ అంచనాలను తారుమారు చేశాయి.

ప్రస్తుతం పార్టీ క్యాడర్ పూర్తిగా నిరాశ నిస్పృహల్లో ఉంది.దీంతో వారిలో జోష్ నింపాలని జగన్ భావిస్తున్నారు.ఇప్పటికే ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్( jagan ) వరుసగా పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ,  వాటిని గల కారణాలను ఆరా తీస్తున్నారు.

ఇంకా టిడిపి గెలిచిన దగ్గర నుంచి ఏపీలో అల్లర్లు చోటు చేసుకోవడం,  వైసిపి నాయకులే టార్గెట్ గా దాడులు జరుగుతుండడం తదితర కారణాలతో వైసిపి కేడర్ భయాందోళనతో ఉంది.ఈ నేపథ్యంలోనే పార్టీ క్యాడర్ లో ధైర్యం నింపేందుకు జగన్ జిల్లాల పర్యటనలు చేపట్టేందుకు నిర్ణయించుకున్నారు.

Advertisement

ఇటీవల జరిగిన ఎన్నికలు వైసిపి కేవలం 11 స్థానాలకు పరిమితం కావడాన్ని పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.ఎన్నికలకు ముందు పోలింగ్ రోజున దాదాపు 18 లక్షల శాంపిల్స్ తో చేయించిన సర్వే లెక్కలను పార్టీ నేతలతో జగన్ విశ్లేషించారు.

అప్పుడు పూర్తిగా సానుకూలత కనిపించిందని, కానీ ఫలితాలు భిన్నంగా ఉన్నాయని విశ్లేషించారు.ఇక వైసిపి ఓటమి దగ్గర నుంచి సీఎంఓలోని అధికారులు,  జగన్ కోటరీ నాయకులుగా పేరు ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి తదితరుల పైన సొంత పార్టీ నేతలే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండడం, కొంతమంది అధికారులు ,జగన్ కు అత్యంత నమ్మకమైన వారే పార్టీ కొంప ముంచారనే అభిప్రాయాలు పార్టీ క్యాడర్ లో నెలకొనడం, ప్రస్తుతం గందరగోళ పరిస్థితులు ఏర్పడడంతో నేరుగా జగనే రంగంలోకి దిగి పరిస్థితులను చక్కదిద్ది , మళ్లీ పార్టీ క్యాడర్ లో ఉత్సాహం నింపే విధంగా తన పర్యటనలను మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు