బీజేపీకి నితీశ్ హ్యాండ్ ఇవ్వ‌డానికి కార‌ణం.. అదేనా...?

బిహార్ లో నితీశ్ కుమార్ ఇచ్చిన ట్విస్ట్ తో బీజేపీకి గ‌ట్టి షాక్ త‌గిలింద‌నే చెప్పాలి.

బీజేపీతో రెండేళ్ల స్నేహాన్ని వ‌దులుకుని అనూహ్యంగా రాష్ట్రీయ జ‌న‌తా ద‌ళ్ తో క‌లిసి ఎనిమిదోసారి బిహార్ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు.

అయితే ఇక లాలూప్రసాద్ యాదవ్ కుమారుడు ఇప్పటిదాకా బిహార్ ప్రతిపక్ష నేతగా ఉన్న తేజస్వీ యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.ఇక తేజస్వీ సోదరుడు లాలూ మరో కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టే అవ‌కాశం ఉంది.

అయితే బీజేపీకి నితీశ్ గుడ్ బై చెప్ప‌డానికి ముఖ్యంగా ఉప‌రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వీ ఆశించి ద‌క్క‌క‌పోవ‌డంతోనే విడిపోయార‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.ఇదే విష‌యం బిహార్ కు చెందిన సీనియర్ బీజేపీ నేత మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ సంచలన ఆరోపణలు చేశారు.

ఎంతోమంది జేడీయూ నేతలు ఇది నిజమేనా అని బీజేపీ నేతలను ప్రశ్నించారని గుర్తుచేశారు.

నేను ఆశించ‌లేదు.

Advertisement
The Reason For Nitish S Handshake With BJP Is That , Nitish Kumar , Lalu Prasad

నితీశ్

ఈ ఆరోప‌ణ‌లపై స్పందించిన ముఖ్య‌మంత్రి నితీశ్ కుమార్ ఈ వ్యాఖ్య‌లు పెద్ద జోక్ అన్నారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులకు ఎంపిక చేసిన అభ్యర్థులకే తమ పార్టీ జనతాదళ్ యునైటెడ్ మద్దతిచ్చిందని నితీష్ కుమార్ గుర్తు చేశారు.

ఇందుకోసం తమ పార్టీ ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసిందని.రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ముకు ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో జగదీప్ ధనకర్ కు మద్దతిచ్చామని నితీష్ కుమార్ స్ప‌ష్టం చేశారు.

ఉపరాష్ట్రపతి కావాలనే కోరికే తనకు లేదని తేల్చి చెప్పారు.అలా బీజేపీ నేత చెప్పడం విడ్డూరంగా ఉంద‌ని అన్నారు.

The Reason For Nitish S Handshake With Bjp Is That , Nitish Kumar , Lalu Prasad

విచ్చిన్నం చేయ‌డానికే కుట్ర‌.

అయితే జేడీయూని విచ్ఛిన్నం చేయడానికి మహారాష్ట్రలో త‌ర‌హాలోనే బిహార్ లోనూ ఏకనాథ్ షిండేలాంటి వ్యక్తులను ప్రోత్సహించడానికి బీజేపీ కుట్రలు చేసింద‌ని నితీష్ కుమార్ ఆరోపించారు.2024 ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం రాకుండా విపక్షాలు అన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు.ఎట్టి పరిస్థితుల్లోనూ 2025 జరిగే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ 2024లో జరిగే లోక్ సభ ఎన్నికల్లోనూ బీజేపీ అధికారంలోకి రాదని.

సెన్సార్ పూర్తి చేసుకున్న నాని హిట్3 మూవీ.. ఆ సీన్లను కట్ చేశారా?
నితిన్ మార్కెట్ భారీగా పడిపోయిందా..? రాబిన్ హుడ్ డిజాస్టర్ అయిందా..?

ఈ మేరకు అన్ని పార్టీలు కలసికట్టుగా కృషి చేస్తాయని ధీమా వ్య‌క్తం చేశారు.దీనికి కౌంట‌ర్ గా బీజేపీ నేత‌లు నితీష్ కుమార్ కు ఊసరవెల్లికి తేడా లేదని తీవ్ర విమర్శలు చేశారు.

Advertisement

ప్రజలు గత ఎన్నికల్లో బీజేపీ-జేడీయూ కూటమికి అధికారాన్ని ఇచ్చారని గుర్తుచేస్తున్నారు.ప్రజ‌ల తీర్పును నితీష్ ఉల్లంఘించాడని ధ్వ‌జ‌మెత్తింది.ఆర్జేడీతో చేతులు కలిపిన నితీష్ లాంటి రాజకీయ అవకాశవాదులకు ప్రజలే గుణపాఠం చెబుతారని అంటున్నారు.

మ‌రి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏం జ‌రుగుతుందో చూడాలి.

తాజా వార్తలు