దేశానికి పట్టిన దరిద్రం కాంగ్రెస్..: కిషన్ రెడ్డి

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి( Kishan Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.దేశానికి పట్టిన దరిద్రం కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు.

బీజేపీ మళ్లీ వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తారని కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని కిషన్ రెడ్డి మండిపడ్డారు.ఈ క్రమంలోనే ముస్లిం రిజర్వేషన్లను కాంగ్రెస్ ఏ ప్రాతిపదికన తీసుకొచ్చిందని ప్రశ్నించారు.

కశ్మీర్ లో జిన్నా రాజ్యాంగాన్ని కాంగ్రెస్ అమలు చేసిందని ఆరోపించారు.ఈ నేపథ్యంలో రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ కు లేదని చెప్పారు.

తప్పుడు ప్రచారంతో ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ పార్టీ( Congress party ) బ్రిటిష్ వారసత్వాన్ని కొనసాగిస్తోందన్న కిషన్ రెడ్డి సోనియాను కాంగ్రెస్ దేశం మీద రుద్దే ప్రయత్నం చేసిందని విమర్శించారు.

Advertisement

అయితే బీజేపీ( BJP ) ప్రతిఘటించడంతో ఈ విషయంలో కాంగ్రెస్ వెనక్కి తగ్గిందని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ ఇటలీ నేషనల్ కాంగ్రెస్ గా మారిపోయిందన్నారు.

ముస్లింలను బీసీల్లో చేర్చి వారికి కాంగ్రెస్ అన్యాయం చేస్తోందని తెలిపారు.జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కారణంగా బీసీలకు అన్యాయం జరిగిందన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy )కి దమ్ముంటే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

రాజకీయాల్లో పవన్ సక్సెస్ కావడానికి చిరంజీవి ఫెయిల్ కావడానికి అసలు కారణాలివేనా?
Advertisement

తాజా వార్తలు