తెరుచుకున్న అయ్యప్ప స్వామి దేవాలయం.. ఈ సారి ప్రత్యేకమైన ఆకర్షణలు ఇవే..!

ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప ఆలయం( Sabarimala Ayyappa Temple ) రెండు నెలల పాటు జరిగే మండల తీర్థయాత్ర కోసం తెరుచుకుంది.

ఈ ఆలయానికి నూతనంగా ఎన్నికైన ప్రధాన అర్చకులు పీఎన్ మహేష్ బాధ్యతలు స్వీకరించారు.

ప్రస్తుత ప్రధాన అర్చకుడు కె.జయరామన్ నంబూతిరి బంధువు మృతి కారణంగా పూజకు హాజరు కాలేదు.ఇంకా చెప్పాలంటే ఈ సారి దేవాలయ ప్రవేశ ద్వారంలో ఏర్పాటు చేసిన రాతి స్తంభాలు భక్తుల మనసు దోచుకుంటున్నాయి.

నిర్మాణంలో ఉన్న హైడ్రాలిక్ పైకప్పులో స్తంభాలు కూడా ఒక భాగం.హైదరాబాద్ కు చెందిన విశ్వ సముద్రం అనే నిర్మాణ సంస్థ అయ్యప్ప స్వామికి కానుకగా పైకప్పును నిర్మించింది.

ఈ ప్రాజెక్టు కోసం కంపెనీ దాదాపు 70 లక్షల కేటాయించినట్లు సమాచారం.పదినెట్టం పడి కి ఇరువైపులా ఏర్పాటు చేస్తున్న స్తంభాలలో స్వామియే శరణమయ్యప్ప అనే అక్షరాలతో అందమైన తిరిగే చక్రాలు ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయని భక్తులు చెబుతున్నారు.అలాగే వర్షం లేని సమయంలో రూఫ్ కు ఇరువైపులా మడత పెట్టేలా ఉండే హైడ్రాలిక్ రూఫ్ ను చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న క్యాపిటల్ ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ రూపొందించింది.

Advertisement

పతినెట్టం పడి పై కప్పుగా దీన్ని ఏర్పాటు చేయడం వల్ల పడి పూజ ఆచారం సమయంలో ఇబ్బంది ఉండదు.ప్రస్తుతం పడిపూజ సమయంలో మెట్లపై టార్పాలిన్ షీట్ ను వేస్తున్నారు.

ఇంకా చెప్పాలంటే 60 రోజుల పాటు జరిగే మండల తీర్థయాత్ర డిసెంబర్ 27వ తేదీన ముగుస్తుంది.

ఈ డిసెంబర్ 30న మకరవిళక్కు ఉత్సవాల కోసం దేవాలయం తిరిగి తెరవబడుతుంది.జనవరి 15వ తేదీన జరిగే వార్షిక మకరవిళక్కు ఉత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు( Devotees ) హాజరయ్యే అవకాశం ఉందని దేవాలయం ముఖ్య అధికారులు చెబుతున్నారు.శబరిమల దేవాలయంలో తీర్థయాత్ర సీజన్ లో భక్తుల రద్దీని నియంత్రించడానికి ఆరు దశల్లో 13 వేల మంది పోలీసులను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ షేక్ దర్వేష్ వెల్లడించారు.

అలాగే చిన్నారులు,వృద్ధులు దర్శనం చేసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు.అయ్యప్ప సన్నిధిలో తాత్కాలిక పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

మీ వెన్నెముక బ‌లంగా ఉండాలా? అయితే ఈ జాగ్ర‌త్తలు తీసుకోవాల్సిందే!
Advertisement

తాజా వార్తలు