ఖాళీ అవుతున్న కారు పార్టీ క్యాడర్ కంగారులో లీడర్...?

కోదాడ నియోజకవర్గ పరిధిలోని అనంతగిరి,కోదాడ,చిలుకూరు,నడిగూడెం,మునగాల,మోతె మండలాల్లో బీఆర్ఎస్ (BRS)క్యాడర్ మూకుమ్మడిగా రాజీనామాలు చేసి కాంగ్రెస్(Congress) పార్టీలో చేరుతున్నారు.

దీంతో ఆయా గ్రామాల్లో కారు పార్టీ ఖాళీ అవుతుండగా,కాంగ్రెస్ గ్రాఫ్ రోజురోజుకూ పెరుగుతూ పోతుందని నియోజకవర్గంలో గులాబీ లీడర్ గుబులు పడుతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటివరకు ఈ ప్రచారం కేవలం కోదాడ పట్టణ వార్డుల్లో మాత్రమే ఉండేదని,పార్లమెంట్ ఎన్నికల అనంతరం(Anantaram) ఆ తరహా ప్రచారం గ్రామ స్థాయిలో సైతం జరుగుతున్నట్టు ఆయా పార్టీల ఎంపీ అభ్యర్థులు గుర్తించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇదే విషయాన్ని పార్టీ పెద్దలకు చేరవేసి,కాంగ్రెస్ పార్టీలో చేరెందుకు సిద్ధంగా ఉన్న గులాబీ నాయకులను కాంగ్రెస్లో చేరకుండా ముందు జాగ్రత్త పడుతున్నారని,అయినా వలసలు అడ్డుకోలేక,ఏం చేయాలో అర్థంకాక అయోమయంలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇలాగే కొనసాగితే ఇబ్బందులు తప్పవని,ఇప్పటికైనా పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకొని,ఒత్తిడి తేవాలని కోరుతున్నారట. కాంగ్రెస్(Congress) పుంజుకుంటుంది’అనే మౌత్ పబ్లిసిటి విస్తరించడంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో పల్లెల్లో ఓట్లను ప్రభావితం చేసిందని, ఇప్పుడు కూడా అదే జరిగి ఉంటదని వాపోతున్నారట.

అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెరిగిన వలసల జోరు పెరిగిందని,గ్రామశాఖ అధ్యక్షుల నుండి మండల పార్టీ అధ్యక్షుల వరకు గులాబీ పార్టీ లీడర్,క్యాడర్ భారీగా కాంగ్రెస్ లో చేరుతున్నారని,దీనితో కాంగ్రెస్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయిందని టాక్.పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్,బీఆర్ఎస్(Brs, Congress) మధ్య పోరు పోటాపోటీగా ఉంటుందని అనుకున్నారు.

Advertisement

కానీ, ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే అదేమీ లేకుండా పోయిందని,కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి చేరికలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారని,ఇలాగే కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికల వరకు కారు పార్టీ గ్రామాల్లో కనుమరుగయ్యే సూచనలు కనిపిస్తున్నాయని,సర్పంచ్ లుగా నిలబడే వారే కరువయ్యే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

'హెలికాప్టర్ ' కోసం ఇంత పంచాయతీ జరుగుతోందా ? 
Advertisement

Latest Suryapet News