తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
జబర్దస్త్ స్టేజ్ ద్వారా ఎంతోమంది ఆర్టిస్టులు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే.
జబర్దస్త్ షో ద్వారా పాపులారీటి సంపాదించుకున్న చాలామంది సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి వెండితెరపై సినిమాలలో కూడా అలరించారు.ఇకపోతే ఈ మధ్యకాలంలో జబర్దస్త్ కి ఎంట్రీ ఇచ్చిన వారిలో లేడీ కమెడియన్ ఫైమా కూడా ఒకరు.
ఇదివరకు పటాస్ షో లో తన టాలెంట్ తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది.ఇక ఇటీవల ఫైమా జబర్దస్త్ షో కి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అతి తక్కువ సమయంలోనే తన విలక్షణమైన నటనతో బాగా పాపులర్ కాకుండా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది.
ఫైమా ఎపిసోడ్ ఎపిసోడ్ లో తనలో ఉన్న టాలెంట్ ని బయట పెడుతూ అంచెలంచెలుగా ఎదుగుతోంది.ఇకపోతే ఫైమా జబర్దస్త్ లో బుల్లెట్ భాస్కర్ టీమ్ లో పని చేస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఇది వరకు స్కిట్ లో భాగంగా ఫైమా గ్యాస్ సిలిండర్,అలాగే సైకిల్ ను నోటితో ఎత్తిన విషయం అందరికీ తెలిసిందే.అయితే తాజాగా ఫైమా ఏకంగా తన నోటితో స్కూటీ ని వచ్చింది.
తాజాగా విడుదలైన జబర్దస్త్ ప్రోమో లో ఒక స్కిట్ లో భాగంగా బుల్లెట్ భాస్కర్ నువ్వు ఏం చేస్తే నేను అది చేస్తా అనడంతో ఫైమా వెళ్ళి నోటితో స్కూటీ ని ఎత్తడం తో అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోతారు.జడ్జి ఇంద్రజ అయితే ఒక్క సారిగా షాక్ అవుతుంది.ఇందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy