కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది..: కిషన్ రెడ్డి

కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు.ప్రజాధనం వృధా చేసి నాసిరకం ప్రాజెక్ట్ నిర్మించారని ఆరోపించారు.

మేడిగడ్డపై ఇంతవరకు కేసీఆర్ స్పందించలేదన్న కిషన్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణ జరగాలని డిమాండ్ చేశారు.కాళేశ్వరం ఫెయిల్యూర్ ప్రాజెక్టుగా మారిందన్నారు.

మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిన ఘటనకు పూర్తిగా కేసీఆరే బాధ్యత వహించాలని తెలిపారు.ఈ విషయంలో తప్పు జరిగిందని క్షమాపణ చెప్పాల్సింది పోయి కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నారని కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

రోజుకు ఐదు నిమిషాలు గోడ కుర్చీ వేస్తే ఎన్ని ప్ర‌యోజ‌నాలో..?!
Advertisement

తాజా వార్తలు