చైన్ స్నాచర్ గా మారిన కానిస్టేబుల్.. అడంగా ఎలా దొరికిపోయాడంటే..?

సమాజంలో ఎటువంటి దారుణాలు, దొంగతనాలు జరుగకుండా రక్షణ కల్పించే బాధ్యత పోలీసులదే.

ఎవరైనా దొంగతనం చేస్తే బుద్ధి చెప్పాల్సిన పోలీసులే దొంగతనాలకు పాల్పడితే ఇక సామాన్య ప్రజలకు రక్షణ అనేది ఉండదు.

కానిస్టేబుల్ ( Constable )పగలంతా బుద్ధిమంతుడులా ఉంటూ తెల్లవారుజామున చైన్ స్నాచర్ గా మారి ప్రజల సొమ్మును దోచుకోవడం మొదలుపెట్టాడు.సాధారణంగా పోలీసులలో కేవలం కొంతమంది మాత్రమే లంచాలకు పాల్పడతారని అందరికీ తెలిసిందే.

కానీ బాధ్యత గల పోలీస్ అధికారి పార్ట్ టైం జాబ్ లాగా దొంగతనాలు చేస్తున్నాడు అంటే ఎవరైనా ఆశ్చర్యపోతారు.ఇంతకీ ఆ పోలీస్ కానిస్టేబుల్ దొంగగా మారాల్సిన అవసరం ఏమొచ్చింది.

దొంగతనాలు చేసి ఎలా దొరికిపోయాడో అనే వివరాలను చూద్దాం.బానేశ్( Banesh ) అనే వ్యక్తి మంచిర్యాల జిల్లా( Mancherial ) మందమర్రిలోని కోటపల్లి పోలీస్ స్టేషన్లో పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు.

Advertisement

అయితే బానేశ్ జల్సాలకు అలవాటు పడి, తెలిసిన వారందరి దగ్గర అప్పులు చేశాడు.ప్రతి నెల వచ్చే జీతం సరిపోకపోవడం, అప్పులు పెరిగిపోవడంతో ఏం చేయాలో అర్థం కాక చివరికి దొంగతనాలు చేసి అప్పులు తీర్చాలని నిర్ణయించుకున్నాడు.

ఇక దొంగతనాలు ఎప్పుడు చేయాలి.ఎక్కడ చేయాలి.

ఏ సమయంలో చేయాలి అని ముందుగా పక్కా ప్రణాళికతో ప్లాన్ రచించుకున్నాడు.డ్యూటీలో ఉంటూనే తెల్లవారుజామున మంచిర్యాల, మందమర్రి రైల్వేస్టేషన్లో దర్జాగా దొంగతనాలు చేయడం ప్రారంభించాడు./br>

ఇక చైన్ స్నాచింగ్ కేసులు అధికం కావడంతో జీఆర్పీ పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.ఈ విషయం బానేశ్ కు తెలియదు.రోజు మాదిరిగానే మంచిర్యాల, మందమర్రి రైల్వేస్టేషన్లో చైన్ స్నాచింగ్ చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా జీఆర్పీ పోలీసులకు చిక్కాడు.

Bet365 бонусная программа: разбор механик, ограничений и реальной ценности
Happy Luke Bonuses: A Practical Breakdown For UK Players

ఈ విషయం బయటకు తెలియకుండా జీఆర్పీ పోలీసులు గోప్యంగా ఉంచి బానేశ్ ను రిమాండ్ కు తరలించారు.

Advertisement