ఇదేం శ్యాడిజం.. స్కూటీని ఢీ కొట్టడమే కాకుండా అమాంతం ఈడ్చుకెళ్లిన కారు..

ప్రతిరోజు దేశవ్యాప్తంగా పదుల సంఖ్యలో జరుగుతున్న యాక్సిడెంట్ల ( Accidents )కారణంగా అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు.

ఈ యాక్సిడెంట్స్ వల్ల కొందరు సొంత తప్పిదాల వల్ల ప్రాణాలు కోల్పోతుంటే.

మరికొందరు ఎదుటివారి తప్పువాల్ల ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది.అయితే ప్రస్తుతం ఉన్న సిసిటీవీ కెమెరాల నేపథ్యంలో అనేక యాక్సిడెంట్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం చూస్తూనే ఉంటాము.

ఒక స్కూటీని ఢీ కొట్టగా కారు ముందు పడి ఉన్న కానీ ఆ కారు ఒక కిలోమీటర్ వరకు వెళ్లిన ఘటన సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నగరంలో( Lucknow , Uttar Pradesh ) ఈ సంఘటన చోటుచేసుకుంది.పీజీఐ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిసాన్ వంతెనపై ( Kisan Bridge )ఈ సంఘటన చోటుచేసుకుంది.వంతెన పై వేగంగా వెళుతున్న కారు స్కూటీని ఢీ కొట్టాడు.

Advertisement

ఆ తర్వాత ఆ డ్రైవర్ కారును నిలపకుండా, పట్టించుకోకుండా కారు ముందర స్కూటీ ఉన్న సరే ఆ స్కూటీతోపాటు కిలోమీటర్ దూరం దానిని ఈడ్చుక వెళ్ళాడు.దీంతో కారు ముందర స్కూటీని ఈడ్చుకు వెళుతున్న సమయంలో స్కూటీ నుండి పెద్ద ఎత్తున నిప్పు రవ్వలు ఎగసిపడ్డాయి.

వంతెన పై కారు స్కూటీని ఢీకొన్న సమయంలో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి.గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు.

సంబంధించి నగర ట్రాఫిక్ పోలీసులు( Traffic Police ) స్పందించారు.ఘటనకు పాల్పడిన కారు డ్రైవర్ ను వారు అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు.ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని ప్రయాగ్రాజ్ కు చెందిన చంద్రప్రకాష్ గా పోలీసులు గుర్తించారు.

ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.ఇలాంటి కొందరు దుర్మార్గులు రోడ్డుపై తిరుగుతుంటారు కాబట్టి వీలైనంత మీ జాగ్రత్తలో మీరు వాహనాలు నడుపుతూ జాగ్రత్తగా ఇంటికి చేరండి.

పార్సెల్ వచ్చిన హెయిర్ డ్రైయర్ పేలి చేతులను కోల్పోయిన మహిళ
Advertisement

తాజా వార్తలు