జగన్ సత్తా ఇప్పుడు అర్థమైందా ? వెంటపడుతున్నారుగా ?

వైస్సార్ కాంగ్రెస్ పార్టీ విషయంలో ఎప్పటికప్పుడు బిజెపి స్టాండ్ మార్చుకుంటూ వస్తోంది.

వైసిపి ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు పై కోపంతో జగన్ కు సహకరించిన బిజెపి, ఆ తర్వాత కూడా జగన్ తో సన్నిహితంగానే మెలిగింది.

అయితే కొద్ది నెలలకే జగన్ ను పూర్తిగా దూరం పెట్టినట్లుగా వ్యవహరించడంతో పాటు, అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేశారు.ఢిల్లీ బీజేపీ పెద్దలు సైతం జగన్ ను కలిసేందుకు ఏమాత్రం ఇష్టపడేవారు కాదు.

అపాయింట్మెంట్ సైతం ఇవ్వకుండా వెయిటింగ్ లో పెట్టేవారు.  జగన్ మాత్రం బిజెపిని విమర్శించేవారు కాదు.

అలాగే కీలకమైన బిల్లులకు తమ ఎంపీల ద్వారా మద్దతు ఇచ్చేవారు.అయినా ఇదే వైఖరితో బిజెపి ఉంటూ వచ్చింది.

Advertisement
Bjp Is Giving More Priority To Ap Cm Jagan, Jagan, Bjp, Ysrcp, Ap, Tdp, Modhi, A

అయితే ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో సమూల మార్పులు చోటు చేసుకున్నాయి.బిజెపి సైతం తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది.

ఇప్పటికే అనేక పార్టీలు బిజెపి కూటమికి దూరమయ్యాయి.రానున్న రోజుల్లో బిజెపి కి మద్దతు ఇస్తున్న పార్టీలు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

ఈ వ్యవహారాలతో కాస్త కంగారు పడుతున్న బీజేపీ అధిష్టానం ఇప్పటి నుంచే ప్రాంతీయ పార్టీలను దగ్గర చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.దీనిలో భాగంగానే అన్ని రకాలుగా సహకరిస్తూ వస్తున్న వైసీపీ అధినేత జగన్ కు ప్రాధాన్యం పెంచింది.

త్వరలో చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణలో మూడు మంత్రి పదవులు ఇస్తామంటూ జగన్ కు ఆఫర్లు ఇస్తోంది.

Bjp Is Giving More Priority To Ap Cm Jagan, Jagan, Bjp, Ysrcp, Ap, Tdp, Modhi, A

అదీ కాకుండా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో శరద్ పవార్ కేంద్రంగా ప్రాంతీయ పార్టీల కూటమి తెరపైకి రావడం, బిజెపిని మరింత కంగారు పెడుతోంది.ఇంకా ఆ కూటమిలోకి వెళ్ళే విషయంలో జగన్ ఏ నిర్ణయం  తీసుకోకపోవడంతో, తమ దారిలోకి తెచ్చుకునేందుకు బిజెపి ప్రయత్నాలు మొదలుపెట్టింది.అందుకే జగన్ కోరిన డిమాండ్లను నెరవేర్చేందుకు, కేంద్ర మంత్రివర్గంలోకి వైసిపిని తీసుకుని రాబోయే రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునేందుకు బిజెపి ప్రయత్నాలు మొదలుపెట్టింది.

Advertisement

అందుకే మొదట్లో జగన్ ను దూరం పెట్టినా, ఇప్పుడు వెంటపడుతున్నట్టు గా వ్యవహరిస్తున్నారు.

తాజా వార్తలు