స‌మ్మ‌ర్ ఫ్రూట్ మ్యాంగోతో బెస్ట్ వెయిస్ లాస్ స్మూతీ మీకోసం..!

ప్ర‌స్తుత స‌మ్మ‌ర్ సీజ‌న్( Summer season ) లో ఎక్క‌డ చూసినా మామిడిపండ్లు భ‌లేగా క‌నివిందు చేస్తుంటాయి.అలాగే రుచి గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే.

పెద్ద‌లే కాదు పిల్ల‌లు కూడా మామిడిపండ్ల‌ను ఎంతో ఇష్టంగా తింటుంటారు.అయితే వెయిట్ లాస్ అవ్వాల‌ని భావించే వారికి కూడా ఈ స‌మ్మ‌ర్ ఫ్రూట్ ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది.

ముఖ్యంగా మ్యాంగోతో ఇప్పుడు చెప్ప‌బోయే స్మూతీ త‌యారు చేసుకుని తీసుకున్నారంటే వెయిట్ లాస్ అవ్వ‌డం గ్యారెంటీ.ముందుగా బ్లెండ‌ర్ తీసుకుని అందులో అర‌క‌ప్పు పీల్ తొల‌గించిన మామిడి పండు ముక్కలు( Mango slices ) వేసుకోవాలి.

అలాగే ఐదారు ఫ్రెష్ పుదీనా ఆకులు( Mint leaves ), అర టేబుల్ స్పూన్ లెమ‌న్ జ్యూస్( Lemon juice ), ఒక క‌ప్పు చ‌ల్ల‌బ‌డిన గ్రీన్ టీ మ‌రియు కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి మెత్త‌గా బ్లెండ్ చేసుకోవాలి.దాంతో హెల్తీ అంటే టేస్టీ గ్రీన్ టీ మ్యాంగో స్మూతీ అనేది రెడీ అవుతుంది.

Advertisement

తక్కువ కాలరీలను క‌లిగి ఉండే ఈ స్మూతీలో యాంటీ ఆక్సిడెంట్లు మ‌రియు మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ముఖ్యమైన పోష‌కాలు మెండుగా నిండి ఉంటాయి.

మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో ఈ గ్రీన్ టీ మ్యాంగో స్మూతీని తీసుకుంటే మెట‌బాలిజం వేగ‌వంతం అవుతుంది.శ‌రీరం అధిక క్యాల‌రీల‌ను ఖ‌ర్చు చేస్తుంది.ఎక్కువ స‌మ‌యం క‌డుపు నిండుగా ఉంటుంది.

అతి ఆక‌లి దూరం అవుతుంది.గ్రీన్ టీ – మ్యాంగో కాంబినేషన్‌లో త‌యారు చేసుకునే ఈ స్మూతీ వెయిట్ లాస్‌కి చాలా అనుకూలంగా ఉంటుంది.

అంతేకాదండోయ్‌.ఈ గ్రీన్ టీ మ్యాంగో స్మూతీలో ఉండే బీటా కెరోటిన్, విటమిన్ సి మరియు శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.

ఎంత ప్రయత్నించినా జుట్టు రాలడం ఆగట్లేదా.. అయితే మీరు ఇది ట్రై చేయాల్సిందే!

చ‌ర్మ ఆరోగ్యాన్ని మెరుగుప‌రుస్తాయి.

Advertisement

మామిడిలో ఉండే ఫైబర్ మరియు గ్రీన్ టీ లో ఉండే సహజ రసాయనాలు జీర్ణక్రియను చురుగ్గా మారుస్తాయి.మ‌ల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్య‌కు చెక్ పెడ‌తాయి.ఈ గ్రీన్ టీ మ్యాంగో స్మూతీ ఒక మంచి డిటాక్స్ డ్రింక్ గా కూడా ప‌నిచేస్తుంది.

టాక్సిన్స్ ను బయటకు పంపించి.కాలేయ ప‌నితీరును పెంచుతాయి.

పైగా ఈ స్మూతీ బాడీని హైడ్రేట్ గా ఉంచుతుంది.శ‌రీరానికి త‌క్ష‌ణ శ‌క్తిని అందిస్తుంది.

అల‌స‌ట‌ను దూరం చేసి మూడ్ ను కూడా స్టేబుల్ గా ఉంచుతుంది.

తాజా వార్తలు