వంగ‌వీటి అందుకే వాళ్ల‌కు అంత లైట్ అయ్యాడా...!

విజ‌య‌వాడ‌లో వంగ‌వీటి వంశాంకురం వంగ‌వీటి రాధాను ప్ర‌స్తుతం  ఏ పార్టీ నాయ‌కులు కూడా పట్టించుకోవ‌డం లేదు.వంగ‌వీటి రాధా ఇప్పుడు అంద‌రికి లైట్ అయిపోయాడు.

రాధా ఏ పార్టీలో ఉన్నా కూడా యాక్టివ్‌గా ఉండ‌క‌పోవ‌డం ఆయ‌న‌కు మైన‌స్ అయ్యింది.అప్పుడెప్పుడో వైఎస్ జ‌మానాలో ఎమ్మెల్యే అవ్వ‌డం మిన‌హా ఆయ‌న రాజ‌కీయం గురించి చెప్పుకోవ‌డానికి ఏం లేదు.

ఆ త‌ర్వాత వైఎస్ మంత్రి ప‌ద‌వి ఆఫ‌ర్ చేసినా ప్ర‌జారాజ్యంలోకి వెళ్లి ఓడారు.ఆ త‌ర్వాత వైసీపీలోకి వెళ్లి నియోజ‌క‌వ‌ర్గం మారి మ‌రోసారి ఓడిపోయారు.

గ‌త ఎన్నిక‌ల‌కు ముందు మ‌ళ్లీ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తాన‌ని వంగ‌వీటి చెప్పారు.అయితే ఆయ‌న యాక్టివ్‌గా లేక‌పోవ‌డంతో జ‌గ‌న్ సెంట్ర‌ల్ సీటు ఇచ్చేందుకు ఇష్ట‌ప‌డ‌లేదు.

Advertisement

దీంతో తూర్పు సీటు లేదా బంద‌రు ఎంపీ లేదా అవ‌నిగ‌డ్డ అసెంబ్లీ సీటు ఇస్తాన‌న్నా రాధా ఒప్పుకోలేదు.ఇక గ‌త ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీలో చేరి ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌క‌పోయినా టీడీపీకి ప్ర‌చారం చేశారు.

చంద్ర‌బాబు ఎమ్మెల్సీ ఆఫ‌ర్ ఇచ్చారు.అస‌లు ఇప్పుడు టీడీపీకి భ‌విష్య‌త్తు ఉంటుందా ? అన్న‌ది గ్యారెంటీ లేదు.వ‌చ్చే నాలుగేళ్ల పాటు రాధాకు ఏ ప‌ద‌వి రాదు.

టీడీపీ ఆయ‌న్ను ప‌ట్టించుకునే ప‌రిస్థితిలో కూడా లేదు.ఇక కొద్ది రోజుల క్రితం ఆయ‌న జ‌న‌సేన‌లోకి వెళ‌తార‌న్న ప్ర‌చారం కూడా జ‌రిగింది.

ఇప్ప‌టికే ప‌లు పార్టీలు మారిన ఆయ‌న నిల‌క‌డ‌లేమి రాజ‌కీయంగా ఎక్క‌డా కుదురుకోలేదు.చంద్ర‌బాబు కూడా ఆయ‌న్ను ప‌క్క‌న పెట్టిన‌ట్టే క‌నిపిస్తోంది.

తాజా ప‌ద‌వుల భర్తీలో వంగవీటి రాధాకు ఎలాంటి ప్రాధాన్యత లభించకపోవడంపై ఆయన వర్గీయుల్లో చర్చ జరుగుతుంది.ఏదేమైనా ఆయ‌న ఏ పార్టీలో ఉన్నా ఆయ‌న్ను పార్టీ అధిష్టానం లైట్ తీస్కోవ‌డానికి ఆయ‌న జ‌నాల్లో ఉండ‌క‌పోవ‌డ‌మే కార‌ణం.

Advertisement

తాజా వార్తలు