కన్నప్ప ప్రాజెక్ట్ లోకి ఆ బాలీవుడ్ స్టార్... మొత్తానికి మంచు విష్ణు ప్లానింగ్ అదుర్స్...

సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకొని ప్రస్తుతం సినిమాలులేకుండా ఖాళీగా ఉంటున్న హీరోలు కొందరు ఇప్పుడిప్పుడే క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా మారుతున్నారు.

మరి కొందరు మాత్రం వాళ్ళకి మార్కెట్ లేకపోయిన హీరోగా సినిమాలు చేస్తూ ప్లాపులు మూట కట్టుకుంటున్నారు అలాంటి హీరోల్లో మంచు విష్ణు ( Manchu Vishnu )ఒకరు.

ఆయన చేసిన సినిమాలు వరుసగా డిజాస్టర్ అవుతున్న ఆయన మాత్రం వరుసగా మంచి సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సాధించుకోవాలి అనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నాడు.ఇక అందులో భాగంగానే ఆయన ఇప్పుడు భక్తకన్నప్ప( Bhaktakannappa ) సినిమాని 150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఈ మధ్యే ఈ సినిమా శ్రీకాళహస్తిలో పూజ కార్యక్రమాలను కూడా జరుపుకుంది.

That Bollywood Star Into The Kannappa Project Manchu Vishnu Is Planning The Who

అయితే ఈ సినిమాలో ప్రభాస్( Prabhas ) శివుడి క్యారెక్టర్ చేస్తున్నాడు అనే టాక్ బయట చాలా ఎక్కువ గా వినిపిస్తుంది.అయితే ఇది ఎంతవరకు కరెక్ట్ అనే విషయం లో అయితే ఇంకా క్లారిటీగా లేదు ప్రభాస్ ఈ సినిమాలో చేస్తున్నాడా లేదా అనేది తెలియాలంటే సినిమా నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేదాకా వెయిట్ చేయాలి.అలాగే నయనతార( Nayanthara ) కూడా ఈ సినిమాలో నటిస్తుంది అనే విషయం మీద చాలా వార్తలు వస్తున్నాయి ఈ విషయాలకు సంబంధించిన అప్డేట్ ని సినిమా యూనిట్ అఫిషియల్ గా అనౌన్స్ చేస్తేనే మనం పరిగణలోకి తీసుకోవాలి.

Advertisement
That Bollywood Star Into The Kannappa Project Manchu Vishnu Is Planning The Who

ఇక ఇవి కాకుండా ఇప్పుడు ఇంకో న్యూస్ ఏమి నడుస్తుంది అంటే ఈ సినిమాలో బాలీవుడ్ కి చెందిన అక్షయ్ కుమార్( Akshay Kumar ) కూడా ఒక పాత్రలో నటిస్తున్నట్టుగా తెలుస్తుంది.ప్రస్తుతం మంచు విష్ణు కి అంత మార్కెట్ లేదు కాబట్టి రేపు ఆయన పెట్టిన 150 కోట్లు రిటర్న్ రావాలి అంటే పాన్ ఇండియా హీరోలని నమ్ముకోక తప్పదు అందుకోసమని ఆయన పాన్ ఇండియా హీరోలని ఈ సినిమాలో పెడుతున్నట్టుగా తెలుస్తుంది.

ఇప్పుడు అక్షయ్ కుమార్ కూడా ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది.ఇక వీళ్ళందరూ సినిమాలో ఉంటేనే ఆ సినిమాకి బిజినెస్ కూడా భారీ లెవెల్లో జరుగుతుందని మంచు విష్ణు చూస్తున్నాడు మరి ఆయన వేసిన ప్లాన్స్ ఎంత వరకు వర్కౌట్ అవుతాయనేది చూడాలి.

Advertisement

తాజా వార్తలు