Mihika rana : మీ దారిలో నడుస్తున్నందుకు కృతజ్ఞతలు.. మిహిక పోస్ట్ వైరల్!

టాలీవుడ్ క్యూట్ కపుల్ దగ్గుపాటి రానా,మిహికా బజాజ్ ల జంట గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.2020 కరోనా మహమ్మారి సమయంలో ఈ జంట మూడుముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.

ఈ మధ్యకాలంలో ఈ జంట పేర్లు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి.

కాగా ఇటీవలే రానా భార్య మిహికా తన మేన కోడలిని ఎత్తుకొని ముద్దాడుతున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అప్పటినుంచి రానా దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు అన్న వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.అందుకు తగ్గట్టుగా మిహికా కూడా కాస్త బొద్దుగా కనిపించడంతో ఆ వార్త నిజమే అంటూ సోషల్ మీడియాలో వార్తలు జోరుగా వినిపించాయి.

ఇక ఈ వార్త వైరల్ అవ్వడంతో రానా అభిమానులు ఆ దంపతులకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేశారు.ఆ తర్వాత రానా ఆ వార్తలపై క్లారిటీ ఇస్తూ అవన్నీ వట్టి రూమర్సే అంటూ కొట్టి పడేసిన విషయం తెలిసిందే.

ఇక రానా భార్య మిహికా తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంది.మిహికాకు కూడా సోషల్ మీడియాలో బాగానే ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.

Advertisement

ఇది ఇలా ఉంటే తాజాగా మిహికా తన భర్త రానాతో కలిసి దిగిన ఒక ఫోటోని తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.ఆ ఫోటోని షేర్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చింది.నాకు ఇంత గొప్ప జీవితాన్ని ఇచ్చిన మీకు అభినందనలు.

మీ దారిలో నడుస్తున్నందుకు కృతజ్ఞతలు.ఆ విషయాల్లో తప్పకుండా మీరు కూడా ఒకరుగా ఉంటారు.

అని రాసుకొచ్చింది మిహిక.కాగా ఈ ట్వీట్ చూసిన రానా అభిమానులు నెటిజెన్స్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ క్యూట్ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కాగా ఆ ఫోటోలో రానా వెనుక వైపు మిహికాని హత్తుకోగా వారిద్దరూ నవ్వుతూ ఫోటోకి ఫోజులు ఇచ్చారు.

జలుబు,దగ్గు, ముక్కు ఇన్ఫెక్షన్స్ ని ఇలా కంట్రోల్ చేయండి
Advertisement

తాజా వార్తలు