త్వరలోనే టెస్లా ఫోన్ విడుదల.. ధర, ఫీచర్లు తెలిస్తే..!

ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్‌ మస్క్‌ ఇప్పటికే చాలా వ్యాపార రంగాల్లో అడుగు పెట్టారు.

కొన్ని నెలల క్రితం ఈ ఫేమస్ బిజినెస్ మాన్ స్మార్ట్‌ఫోన్ తయారీ రంగంలోకి కూడా ఎంట్రీ ఇచ్చినట్లు రిపోర్ట్స్ వచ్చాయి.

మళ్లీ ఇప్పుడు మరోసారి మస్క్‌ విడుదల చేయనున్న స్మార్ట్‌ఫోన్‌ గురించి సరికొత్త రిపోర్ట్స్ వస్తున్నాయి.ఈ నివేదికల ప్రకారం 2022 డిసెంబరు చివరి నాటికి ఎలాన్‌ మస్క్‌ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేయనున్నారు.

ఈ ఫోన్‌కు మస్క్‌ ఏమని నామకరణం చేస్తారు? దీని ధర అధికంగా ఉంటుందా? ఇతర ఫోన్ లతో పోలిస్తే ఇందులో భిన్నంగా ఏం ఫీచర్లు ఉంటాయి? అనే సందేహాలను కూడా తాజా రిపోర్ట్స్ నివృత్తి చేస్తున్నాయి.ప్రస్తుత సమాచారం ప్రకారం మస్క్‌ ఈ స్మార్ట్‌ఫోన్‌కు "పై ఫోన్‌" అనే పేరు పెట్టనున్నారు.ఈ మొబైల్‌ 120 రిఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేతో లాంచ్ అవుతుందని సమాచారం.ఇందులో ఒలియోఫోబిక్‌ కోటింగ్‌తో స్క్రాచ్‌ రెసిస్టెంట్ గ్లాస్ ప్రొటెక్షన్, నాలుగు కెమెరాలు ఉంటాయని టాక్.

రియర్ సైడ్‌lowమూడు 50 ఎంపీ కెమెరాలు అందిస్తారట.ముందుభాగంలో 40 ఎంపీ పంచ్‌హోల్ కెమెరా ఆఫర్ చేయనున్నారు.

Advertisement
Tesla Phone Will Be Released Soon.. If You Know The Price And Features Tesla, Pi

టెక్ రిపోర్ట్స్ ప్రకారం పై ఫోన్ కోసం టెస్లా సొంతంగా ఒక కొత్త చిప్‌సెట్‌ను అభివృద్ధి చేస్తోంది.ఆ ప్రాసెసర్ ఏంటనేది, ఇంకా దాని పర్ఫామెన్స్ ఏ రేంజ్ లో ఉంటుంది అనేది తెలియాల్సి ఉంది.

Tesla Phone Will Be Released Soon.. If You Know The Price And Features Tesla, Pi

మస్క్ తయారు చేస్తున్న మొబైల్ ఫోన్ 16జీబీ ర్యామ్, 1టీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో రావచ్చు.ఈ ఫోన్ ధర రూ.70 వేల నుంచి రూ.80 వేల మధ్య ఉండొచ్చని అంచనా.ఐఫోన్ 14 మొబైల్స్ లాగా ఇందులో కూడా శాటిలైట్‌ నెట్‌వర్క్‌ కనెక్టివిటీకి సపోర్ట్ అందిస్తున్నారట.

టెస్లా పై ఫోన్ ఐఫోన్ 12ని పోలి ఉంటుందని అంటున్నారు.అయితే ఇది త్వరలోనే రిలీజ్ అవుతుంది అని అంటున్నారు కానీ కచ్చితమైన తేదీని మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

టికెట్స్ వివాదం : సీనియర్ ఎన్టీఆర్ సమయంలోను ఇదే గొడవ.. దాసరికి ఏం జరిగిందో తెలుసా ?
Advertisement

తాజా వార్తలు