హైదరాబాద్ ప్రగతిభవన్ వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్ ప్రగతిభవన్ వద్ద టెన్షన్ వాతావరణం ఏర్పడింది.డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో పలు ప్రజాసంఘాల నేతలు ప్రగతిభవన్ ముట్టడికి ప్రయత్నించారు.

కానిస్టేబుల్, ఎస్ఐ రిక్రూట్ మెంట్ లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ నిరసనగా ముట్టడికి పిలుపునిచ్చారు.కానిస్టేబుల్, ఎస్ఐ అభ్యర్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఈ క్రమంలో ప్రజాసంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు.అనంతరం నిరసనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు.

దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

Advertisement
Kirol Bet Bonuses And Promotions : A Value Assessment For Experienced Players