తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్- Telugu NRI America News

1.రికార్డ్ స్థాయిలో తానా సభ్యత్వాల నమోదు

అమెరికాలో పెద్ద తెలుగు సంఘం గా పేరు పొందిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా సభ్యత్వ నమోదు కార్యక్రమం రికార్డ్ స్థాయిలో కొనసాగుతోంది.

ప్రస్తుతం తాను సభ్యుల సంఖ్య 70 వేలు గా ఉంది.

2.ఆటా .అవార్డులు నామినేషన్ల కు ఆహ్వానం

అమెరికాలో వివిధ రంగాల్లో విజయాలను అందుకుంటున్న తెలుగు సంతతి వారిని అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఏటా అవార్డులతో సత్కరించింది ఉంది.దీనిలో భాగంగానే వ్యాపారం లీడర్ షిప్, సామాజిక సేవ, సైన్స్ అండ్ టెక్నాలజీ, మెడిసిన్, తెలుగు సాహిత్యం, విద్య, కళలు , తదితర రంగాల్లో గొప్ప ప్రతిభ కనబరిచిన వారిని నామినేట్ చేయాలంటూ ఆటా దరఖాస్తులు కోరుతోంది.మే 15 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

3.గల్ఫ్ దేశాలలో 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

తెలుగుదేశం జీసీసీ ఆధ్వర్యంలో పార్టీ 40 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గల్ఫ్ దేశాలైన కువైట్, సౌదీ అరేబియా, ఖతర్, ఒమన్, బిహ్రైన్ తో పాటు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని దుబాయ్, అబుదాబి, షార్జా, రస్ ఆల్ ఖైమా , పుజై రాహ్, ప్రాంతాలలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రవాసులు ఘనంగా నిర్వహిస్తున్నారు.

4.నాటో దళాల తో కలిసి పార్టీ చేసుకున్న బైడన్

అమెరికా అధ్యక్షుడు జో బైడన్ పోలాండ్ చేరుకున్నారు.ఉక్రెయిన్ పై యుద్ధం నేపథ్యంలో రష్యా పై కఠిన ఆంక్షలు విధించిన బైడన్ పోలాండ్ దేశంలో నాటో సైనికులతో పాటు, అమెరికా ఆర్మీ కి చెందిన 82 వ వైమానిక విభాగానికి చెందిన సైనికులతో కలిసి పిజ్జా పార్టీ చేసుకున్నారు.

5.మయన్మార్ ఆయుధ డీలర్ల పై అమెరికా, బ్రిటన్ కెనడా నిషేధం

మయన్మార్ లో హింసాత్మక పాలనకు నిరసనగా మయన్మార్, ఆయుధ డీలర్ల పై అమెరికా , బ్రిటన్, కెనడా నిషేధం విధించాయి.

6.ఉక్రెయిన్ లో రష్యా దాడులపై డబ్ల్యు హెచ్వో ఆందోళన

ఉక్రెయిన్ లో రష్యా దాడులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్వో ఆందోళన చేపట్టింది.ఉక్రెయిన్ లో ఆసుపత్రులు, వైద్యులు, అంబులెన్స్ లే టార్గెట్ గా 70 దాడులు జరిగినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ దబ్ల్యు హెచ్ వో వెల్లడించింది.

7.ఫేక్ న్యూస్ చట్టం పై పుతిన్ సంతకం

నకిలీ వార్తలను ప్రచారం చేస్తున్న వారిని కట్టడి చేసేందుకు రష్యా కొత్త చట్టాన్ని తయారు చేసింది.దీనిపై రష్యా అధ్యక్షుడు పుతిన్ సంతకం చేశారు.

8.ఉక్రెయిన్ తో యుద్ధం పై రష్యా కీలక ప్రకటన

Advertisement

ఉక్రెయిన్ తో యుద్ధం పై రష్యా కీలక ప్రకటన చేసింది.ఉక్రెయిన్ పై వార్ లో మొదటి దశ పూర్తి అయ్యిందని ప్రకటించింది.

9.చైనా లో కరోనా కలకలం

చైనా లో కరోనా తీవ్ర స్థాయిలో విజృంబించింది.

ఈ నెల లో ఇప్పటి వరకు 50 వేలకి పైగా కేసులు నమోదయ్యాయి.

Advertisement

తాజా వార్తలు