తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్టు 16, బుధవారం 2023

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

. సూర్యోదయం: ఉదయం 6.03 . సూర్యాస్తమయం: సాయంత్రం.

6.37 . రాహుకాలం: మ.12.00 ల1.30 . అమృత ఘడియలు: అమావాస్య మంచిది కాదు.. దుర్ముహూర్తం: ఉ.11.57 మ12.48 .

మేషం:

ఈరోజు దూర ప్రయాణాల్లో కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.చిన్ననాటి మిత్రులకు ఏర్పడిన వివాదాలు పరిష్కారం అవుతాయి.కుటుంబ సభ్యుల సహాయంతో చాలా కాలంగా పూర్తికాని పనులు పూర్తి చేస్తారు.ఇంటికి సంబంధించిన కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. .

వృషభం:

ఈరోజు మీ వృత్తి వ్యాపారాల్లో మంచి లాభాలను అందుకుంటారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.మీరంటే గిట్టని వారు విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. .

మిథునం:

ఈరోజు బంధుమిత్రుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి.ఇంట బయట మీ మాటకు విలువ పెరుగుతుంది.ఆర్థికపరంగా ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి.అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది.కొన్ని ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.చాలా సంతోషంగా ఉంటారు. .

కర్కాటకం:

Advertisement

ఈరోజు మీరు దూర ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది.కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండాలి.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన నా కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.మీ విలువైన సమయాన్ని అనవసరంగా వృధా చేయకండి. .

సింహం:

ఈరోజు ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా సాగుతుంది.చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి.కొందరి ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు.పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నిస్తారు. .

కన్య:

ఈరోజు వ్యాపార విషయాల్లో మీ జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది.వృత్తి ఉద్యోగాల్లో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.చేపట్టిన పనులు సకలంలో పూర్తి చేస్తారు.ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.చాలా సంతోషంగా ఉంటారు. .

తుల:

ఈరోజు వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు.ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు.సంతాన విద్య విషయాల్లో శుభవార్తలు అందుతాయి.దేవదర్శనాల వంటి దూర ప్రయాణాలు చేస్తారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. .

వృశ్చికం:

కల్కి పై మోహన్ బాబు రివ్యూ...భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!
మహిళలు ఏ దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఏ విధంగా వెళ్లాలో తెలుసా..?

ఈరోజు ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగుతారు.ఇతర విషయాలు కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టాలి.కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది.బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా సమయానికి తిరిగి మీ చేతికి అందుతుంది. .

ధనుస్సు:

Advertisement

ఈరోజు ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు.ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరిగిన సమయానికి పూర్తి చేస్తారు.ధన ఆదాయం బాగుంటుంది.మీ పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది.లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. .

మకరం:

ఈరోజు మీ చిన్ననాటి మిత్రులతో విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. .

కుంభం:

ఈరోజు మీ మిత్రులతో దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.మొండి బాకీలు వసూలు అవుతాయి.చేపట్టిన పనుల్లో కొన్ని అడ్డంకులను ఎదుర్కొంటారు.తరచూ మీ నిర్ణయాలను మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. .

మీనం:

ఈరోజు అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.కొన్ని కొత్త పనులను ప్రారంభించే ముందు ఆలోచనలు ఎంతో అవసరం..

తాజా వార్తలు