తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి31, సోమవారం 2025

ఈ రోజు పంచాంగం ( Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.12

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.30

రాహుకాలం: ఉ.7.30 ల9.00

అమృత ఘడియలు: ఉ.6.20 ల6.56 సా7.32 ల7.58

Advertisement
Telugu Daily Astrology Prediction Telugu Rasi Phalalu March 31 Monday 2025, Marc

దుర్ముహూర్తం: మ.12.24 ల1.12మ2.46 ల3.34

మేషం:

Telugu Daily Astrology Prediction Telugu Rasi Phalalu March 31 Monday 2025, Marc

ప్రయాణాలలో మార్గవరోదాలు కలుగుతాయి.విద్యార్థులు ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి.చేపట్టిన పనుల్లో ఆటంకాలుంటాయి.

వ్యాపార, ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు చోటుచేసుకుంటాయి.స్ధిరాస్తి వివాదాలుంటాయి కొంత చికాకు పరుస్తాయి.

బన్నీ అట్లీ కాంబినేషన్ మూవీలో హీరోయిన్ ఈమేనా.. ఈ ఆఫర్ తో దశ తిరిగినట్టే!
ఆ ఆలోచన వచ్చిన తొలి హీరో చిరంజీవి.. ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు వైరల్!

మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

Advertisement

వృషభం:

గృహ నిర్మాణ ప్రారంభానికి శ్రీకారం చుడతారు.చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.వృత్తి వ్యాపారాలు గతంకంటే మెరుగ్గా ఉంటాయి.

ఉద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి.గృహ వాతావరణం సంతోషంగా ఉంటుంది.

నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

మిథునం:

ఇంటా బయట గందరగోళ పరిస్థితులుంటాయి.ఆర్ధిక సమస్యలు మరింత భాదిస్తాయి.ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యడం మంచిది.

ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.వృత్తి ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుని నష్టపడతారు.

కర్కాటకం:

ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించడం మంచిది.వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం.అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉండక నూతన రుణయత్నాలు చెయ్యవలసి వస్తుంది.

అనుకున్న సమయానికి పనులు పూర్తికాక చికాకు పెరుగుతుంది.వృత్తి ఉద్యోగాలలో ఆకస్మిక స్థాన చలన సూచనలున్నవి.

సింహం:

చేపట్టిన పనులలో ఆకస్మిక విజయం సాధిస్తారు.చాలాకాలంగా పూర్తికాని పనులు పూర్తి చేస్తారు.నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.ఉద్యోగస్థులకు అనుకూల వాతావరణం ఉంటుంది.

కన్య:

చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి.బంధు మిత్రుల నుండి విలువైన సమాచారం అందుతుంది.గృహమున కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు.వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి.

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

తుల:

ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి.వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు.దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి.ఉద్యోగస్తులు అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

వృశ్చికం:

నూతన రుణయత్నాలు చెయ్యవలసి వస్తుంది.దూర ప్రయాణాలు వాయిదా పడతాయి.చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.

బంధు మిత్రుల నుండి ఊహించని మాటలు వినవలసివస్తుంది.ఉద్యోగులకు స్థానచలన సూచనలున్నవి.

వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

ధనుస్సు:

ఈరోజు బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది.వృత్తి ఉద్యోగాలలో అందరితో సఖ్యతగా వ్యవహరించి ఆకట్టుకుంటారు.సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి.

ఆర్ధిక ప్రయత్నాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి.వాహన అనుకూలత కలుగుతుంది.

మకరం:

ఈరోజు ఋణ ఒత్తిడి అధికమై మానసిక శిరో భాధలు తప్పవు.దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు.

సంతాన విషయమై ఊహించని విషయాలు తెలుస్తాయి.స్థిరాస్తి ఒప్పందాలు కష్టం మీద పూర్తవుతాయి.

వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.

కుంభం:

ఈరోజు ఆప్తుల నుండి అవసరానికి సహాయ సహకారాలు అందుతాయి.దీర్ఘ కాలిక రుణాల నుండి విముక్తి లభిస్తుంది.వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది.

సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు.వ్యాపార పరంగా నూతన పెట్టుబడులు లభిస్తాయి.

మీనం:

ఈరోజు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.బంధు మిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులు పొందుతారు.నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

విందు వినోద కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు.సంతానం విద్యా విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి.

తాజా వార్తలు