తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి20, గురువారం 2025

ఈ రోజు పంచాంగం ( Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.22

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.28

రాహుకాలం: మ.1.30 ల3.00

అమృత ఘడియలు: ఉ.10.47 ల11.23 సా5.47 ల6.35

Advertisement

దుర్ముహూర్తం: ఉ.10.00 ల10.4

మ.2.48 ల3.36

మేషం:

ఈరోజు బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.ఆర్థిక పరిస్థితి మరింత మెరుగు పడుతుంది.వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది.

స‌మ్మ‌ర్‌లో బీర‌కాయ తింటే ఎన్ని బెనిఫిట్సో తెలుసా?

చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేస్తారు.నూతన వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.

Advertisement

పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు.

వృషభం:

ఈరోజు కుటుంబ పెద్దల ఆరోగ్య విషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.ఇంటా బయట బాధ్యతలు మానసికంగా చికాకు కలిగిస్తాయి.వృత్తి, వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది.

నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.నూతన ఋణ ప్రయత్నాలు కలసిరావు.

మిథునం:

ఈరోజు ఆర్థికంగా వ్యవహారాలు సంతృప్తి కలిగిస్తాయి.దూరపు బంధువుల నుండి ఆకస్మిక ఆహ్వానాలు అందుతాయి.కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తిచేస్తారు.

చేపట్టిన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది.వృత్తి, ఉద్యోగాలు ఉత్సహంగా సాగుతాయి.

వ్యాపారాలు అభివృద్ధిబాటలో సాగుతాయి.

కర్కాటకం:

ఈరోజు నూతన ఋణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది.కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి.బంధుమిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి.

ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది.వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో వివాదాలు కలుగుతాయి.

సింహం:

ఈరోజు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు.దూర ప్రయాణాలు వాయిదా పడతాయి.చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి.

ఇంటా బయట పని ఒత్తిడి పెరిగి శిరోభాధలు కలుగుతాయి.వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

నిరుద్యోగుల ప్రయత్నాలు మందగిస్తాయి.

కన్య:

ఈరోజు గృహమున ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు.చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు.

వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి.వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి బయటపడతారు.

తుల:

ఈరోజు జీవిత భాగస్వామితో దైవదర్శనాలు చేసుకుంటారు.వృధా ఖర్చులు పెరుగుతాయి.ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.

ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.

వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

వృశ్చికం:

ఈరోజు నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు.చేపట్టిన కార్యక్రమాలు మధ్యలో నిలిచిపోతాయి.దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు విషయంలో జాగ్రత్త వహించాలి.వృత్తి వ్యాపారాలలో ప్రభుత్వాధికారులు నుండి సమస్యలు కలుగుతాయి.

ధనుస్సు:

ఈరోజు నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు.నిరుద్యోగ ప్రయత్నాలు ఉత్సాహంగా సాగుతాయి.వృత్తి ఉద్యోగాల్లో అధికారుల ఆదరణ పెరుగుతుంది.

ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది.పాత మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.

జీవిత భాగస్వామి నుండి ధన సహాయం అందుతుంది.

మకరం:

ఈరోజు దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి.వృత్తి వ్యాపారాలలో వ్యయ ప్రయాసలతో కానీ పనులు పూర్తి కావు.ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు పెరుగుతాయి.

చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు.ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది.

కుంభం:

ఈరోజు కుటుంబ సభ్యులతో వివాదాలు పరిష్కరించుకుంటారు.ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు.ధన వ్యవహారాలు సంతృప్తి ఇస్తాయి.

నూతన వ్యాపారాలు విస్తరణకు అవరోధాలు తొలగుతాయి.వృత్తి ఉద్యోగాల్లో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.

నిరుద్యోగ ప్రయత్నాలు సఫలమౌతాయి.

మీనం:

ఈరోజు గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు.చిన్ననాటి మిత్రుల నుండి ధన సహయం అందుతుంది.నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు.

స్ధిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు.నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి.

తాజా వార్తలు