తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఫిబ్రవరి 5, ఆదివారం 2023

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.50

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

09

రాహుకాలం:సా.4.30 ల6.00 వరకు

అమృత ఘడియలు:ఉ.6.00 ల11.00 మ2.00 సా4.00.

Advertisement

దుర్ముహూర్తం:సా.5.02 ల5.53వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు కొన్ని పనులు వాయిదా పడతాయి.దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

దేవదర్శనాల వంటి ప్రయాణాలు చేస్తారు.మీ పాత స్నేహితులతో కలిసి కొన్ని పనులు పూర్తి చేస్తారు.

న్యూస్ రౌండప్ టాప్ 20

వృషభం:

Advertisement

ఈరోజు మీరు అనవసరమైన వస్తువులు కొనడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.తొందర పడేటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.పిల్లల భవిష్యత్తు గురించి కొన్ని ఆలోచనలు చేయడం మంచిది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయాల్లో కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది.

మిథునం:

ఈరోజు అనుకోకుండా కొన్ని పరిచయాలు చేసుకుంటారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.వ్యాపారస్తులకు పనులు త్వరగా పూర్తి అవుతాయి.

పిల్లల భవిష్యత్తు గురించి ఇతరుల నుండి సలహాలు తీసుకోవాలి.లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.

కర్కాటకం:

ఈరోజు అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.

ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

సింహం:

ఈరోజు మీకు ఆర్థికంగా సహాయం అందుతుంది.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి నిర్ణయాలు తీసుకోవాలి.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.చాలా సంతోషంగా ఉంటారు.

కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.అవసరం లేని వస్తువులు కొనుగోలు చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.కుటుంబ సభ్యులతో కలిసి ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి.

వ్యాపారస్తులకు కొన్ని ముఖ్యమైన పనులు త్వరగా పూర్తవుతాయి.

తులా:

ఈరోజు మీరు కొన్ని సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఆరోగ్యం పట్ల అనుకూలంగా ఉంది.

కొందరి ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు.కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటారు.

చాలా సంతోషంగా ఉంటారు.

వృశ్చికం:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేయాలని అనుకుంటారు.కానీ కొన్ని కారణాల వల్ల పనులు వాయిదా పడతాయి.దీనివల్ల నిరుత్సాహం చెందుతారు.

కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

ధనస్సు:

ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.అనుకోకుండా పాత స్నేహితులు కలుస్తారు.వారితో కలిసి కాస్త సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

వ్యాపారస్తులకు కొన్ని ముఖ్యమైన పనులు జరుగుతాయి.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచి జరుగుతుంది.

మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేసుకుంటారు.దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.

కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి చర్చించాలి.వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది.

కుంభం:

ఈరోజు మీకు ఇతరుల నుండి ఆర్థికంగా సహాయం అందుతుంది.ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి.కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

వ్యాపారస్తులకు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.మీరు పని చేస్తే చోట అనుకూలంగా ఉంటుంది.

మీనం:

ఈరోజు కొన్ని విలువైన వస్తువులు కొంటారు.పిల్లల భవిష్యత్తు గురించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని గడపాలి.

వ్యాపార పెట్టుబడి విషయాల్లో కొన్ని పనులు త్వరగా పూర్తవుతాయి.చాలా ఉత్సాహంగా ఉంటారు.

తాజా వార్తలు