టీమిండియా కంట్రాక్ట్స్‌పై బీసీసీఐ అధికారిక ప్రకటన.. లిస్ట్ లో తెలుగోడి పేరు..!

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2024-25 సంవత్సరానికి సంబంధించిన టీమిండియా ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్టులను సోమవారం అధికారికంగా ప్రకటించింది.

ఈసారి మొత్తం 34 మంది ఆటగాళ్లకు కేంద్ర కాంట్రాక్టుల్లో చోటు దక్కింది.

నాలుగు వర్గాలుగా (గ్రేడ్ A+, గ్రేడ్ A, గ్రేడ్ B, గ్రేడ్ C) ఈ కాంట్రాక్టులు విభజించబడ్డాయి.గ్రేడ్ A+: ఈ గ్రేడ్‌ కింద ఉన్న ఆటగాళ్లకు రూ.7 కోట్ల వార్షిక వేతనం ఇవ్వనున్నారు.ప్రస్తుతం ఈ గ్రేడ్‌లో రోహిత్ శర్మ,( Rohit Sharma ) విరాట్ కోహ్లీ,( Virat Kohli ) జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా ఉన్నారు.

రోహిత్, కోహ్లీ, జడేజా ఇప్పటికే అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికినప్పటికీ, వారి ప్రాధాన్యతను గుర్తించి బీసీసీఐ వారిని A+ గ్రేడ్‌లో కొనసాగించింది.ఇక గ్రేడ్ A కాంట్రాక్టు కలిగిన ఆటగాళ్లకు రూ.5 కోట్ల వేతనం లభిస్తుంది.ఈ గ్రేడ్‌లో మహమ్మద్ సిరాజ్,( Mohammed Siraj ) కేఎల్ రాహుల్,( KL Rahul ) శుభమన్ గిల్, హార్దిక్ పాండ్యా, మహమ్మద్ షమీ, రిషభ్ పంత్ ఉన్నారు.

తెలుగు తేజం, హైదరాబాద్ డీఎస్పీ మహ్మద్ సిరాజ్ తన స్థాయిని నిలబెట్టుకున్నాడు.

Telugu Cricketer Nitish Kumar Reddy In Bcci Central Contracts Player List Salary
Advertisement
Telugu Cricketer Nitish Kumar Reddy In Bcci Central Contracts Player List Salary

ఇక గ్రేడ్ B గ్రేడ్‌ కింద ఆటగాళ్లకు రూ.3 కోట్ల వార్షిక వేతనం లభిస్తుంది.ఈ జాబితాలో సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ ఉన్నారు.

గతేడాది కాంట్రాక్ట్ కోల్పోయిన శ్రేయస్ అయ్యర్ ఈసారి గ్రేడ్ Bలో స్థానం సంపాదించడం విశేషం.ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో అతని ప్రదర్శనకు ఇది పురస్కారం.

Telugu Cricketer Nitish Kumar Reddy In Bcci Central Contracts Player List Salary

ఇంకా గ్రేడ్ C లోని ఆటగాళ్లకు రూ.కోటి వేతనం లభిస్తుంది.ఇందులో 20 మంది ఆటగాళ్లు ఉన్నారు.

రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజు శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, రజత్ పాటిదార్, ధృవ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ఆకాశ్ దీప్, వరుణ్ చక్రవర్తీ, హర్షిత్ రాణా.తెలుగు క్రికెటర్లలో నితీష్ కుమార్ రెడ్డి( Nitish Kumar Reddy ) ఈసారి గ్రేడ్ Cలో స్థానం సంపాదించాడు.

జాయింట్ పెయిన్స్‌తో బాధ‌ప‌డుతున్నారా..అయితే ఇవి తీసుకోవాల్సిందే.!

గతేడాది బీసీసీఐ( BCCI ) జారీ చేసిన నియమాల ప్రకారం, మూడు టెస్ట్‌లు లేదా 8 వన్డేలు లేదా 10 టీ20లు ఆడిన ఆటగాళ్లకు ఆటోమెటిక్‌గా గ్రేడ్ C కాంట్రాక్ట్ వర్తించనుంది.ఈసారి కేఎస్ భరత్, జితేశ్ శర్మ వంటి కొన్ని కీలక ఆటగాళ్లు కాంట్రాక్టుల్లో స్థానం కోల్పోయారు.

Advertisement

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అశ్విన్‌ కూడా ఈ జాబితాలో లేరు.మొత్తంగా చూస్తే, టీమిండియా ఆటగాళ్లకు బీసీసీఐ జారీ చేసిన తాజా కాంట్రాక్టులు వారి ప్రదర్శన, భవిష్యత్ ప్రాధాన్యతలను ప్రతిబింబిస్తున్నాయి.

తాజా వార్తలు