ఇక్కడ కోట, బాబు మోహన్ అయితే అక్కడ గౌండమణి, సెంథిల్

తెలుగులో చాలామంది కమెడియన్స్ కి కాంబినేషన్స్ ఉంటాయి.

ఒకరిపై ఒకరు పంచులు వేసుకుంటూ ఆ సీన్ ని రక్తి కట్టించి ఈ సినిమా విజయంలో కీలక పాత్రను పోషిస్తారు.

సినిమాకి రొమాన్స్, యాక్షన్, ఎమోషన్స్ ఎలాగో కామెడీ కూడా అంతే ముఖ్యం.అందుకే ప్రతి సినిమాలో కాంబినేషన్ లలో కామెడీని పెట్టడం నాటి నుంచి నేటి వరకు బాగా అలవాటు.

మనకు తెలుగులో కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ కాంబినేషన్ ఎంత బాగా వర్కౌట్ అయిందో మనందరికీ తెలిసిందే.అయితే తెలుగులోనే కాదు తమిళంలో కూడా ఇలాంటి కొన్ని ప్రత్యేకమైన కాంబినేషన్స్ ఎంతో విశేషంగా, విపరీతంగా ఆకట్టుకున్నాయి వారే గౌండమణి, సెంథిల్.ఎన్నో తరాలు మారిన సినిమాలో హాస్యం అంటే సరికొత్త అర్థం చెప్పిన నవ్వుల రారాజులే వీరు.80 , 90 వ దశకంలో బాబు మోహన్, కోటాల కాంబినేషన్ చాలా బాగా వర్క్ అయింది.వారు నటించిన చిన్న రాయుడు, మాయలోడు, మామగారు , రాజేంద్రుడు గజేంద్రుడు, అల్లరి అల్లుడు వంటి దాదాపు పాతిక సినిమాల్లో వీరిద్దరి కాంబినేషన్లో కామెడీ పండింది.

వారు చేసిన కామెడీని తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోరు.తెలుగు వారి గుండెల్లో వీరి స్థానం ఎప్పుడూ పదిలంగానే ఉంటుంది.ఇక కోట, బాబు విషయాన్నీ కట్ చేస్తే వారు పోషించిన అనేక పాత్రలను వారి నేటివిటీకి తగ్గిన తగినట్టుగా తమిళంలో కాస్త మార్పులు చేర్పులు చేసి గౌండమణి, సెంథిల్ లు నటించేవారు.

Advertisement

వీరిది కూడా అద్భుతమైన కాంబోనే.తమిళ సినిమాలు తెలుగులో డబ్బైతే గౌండమణి, సెంథిల్ స్థానంలో కోట బాబు మోహన్ చేరిపోయేవారు ఇక్కడ సినిమాలు తమిళంలో వెళితే అక్కడ కోట, బాబు మోహన్ ప్లేస్ లో గౌండమణి, సెంథిల్ ఉండేవారు.తెలుగు తమిళ ఇండస్ట్రీలను ఈ నవ్వుల రారాజులు ఎన్నో ఏళ్ళ పాటు ఏలారు.

మళ్ళి ఇలాంటి నవ్వులు రావాలంటే మరి ఎన్నేళ్లు పడుతుందో కూడా తెలియదు.ఇలాంటి నటులు పుడతారో లేదో కూడా అనుమానమే.

వీరే ఇక కామెడీ కి దొరికిన ఒక ప్రభంజనం.ఇప్పటికీ వారు తెరపై కనిపిస్తే చాలామంది నవ్వుకుంటారు.

వారు చెప్పే డైలాగులకు థియేటర్లో చప్పట్లు విజిల్స్ వినిపిస్తాయి.

గుండెను తడిమిన పునీత్ పెయింటింగ్.. గీసింది ఎవరంటే...
Advertisement

తాజా వార్తలు