ఎవరు గెలిస్తే తెలంగాణ ముందుకు వెళ్తుందో వారినే గెలిపించండి: కేసీఆర్

ఇప్పుడు తనకు అనేక సవాళ్ళు చేస్తున్న ఈ నేతలు అందరూ తెలంగాణ ఉద్యమ సమయంలో ఎక్కడికి పోయారని ఫైర్ అయ్యారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.

( CM KCR ) మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేటలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో( Praja Aashirvada Sabha ) పాల్గొన్న ముఖ్య మంత్రి కేసీఆర్ ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.

పదేళ్ల క్రితం తెలంగాణ ఎదుర్కొన్న పరిస్తుతులకు ఇప్పటి తెలంగాణకు మీరే పోలిక చూసుకోండంటూ ఆయన ప్రజలకు విన్నవించారు.ఒకప్పుడు పాలమూరులో గంజి కేంద్రాలు ఉండేవని , ప్రజలు పొట్ట చేతపట్టుకుని బ్రతుకు తెరువు కోసం వలసలు పోయేవారని ఇప్పుడు కనిపిస్తున్న అభివృద్ధి అంతా బారాస తోనే( BRS ) సాధ్యమైందని ఆయన చెప్పుకొచ్చారు.

కొంతమంది నాకు కొడంగల్ కి రా ,గాంధీ బొమ్మ దగ్గరకు రా, అంటూ సవాలు చేస్తున్నారని కేసీఆర్ సమర్థత ఎంతో దేశం ఇప్పటికే చూసిందని, ఇప్పుడు ఎవరికీ చూపించాల్సిన అవసరం లేదన్నారు.

Telangana Will Move Forward With Brs Only Kcr Details, Cm Kcr, Praja Aashirvada

60 లక్షల టన్నుల వరి పండే తెలంగాణలో ఇప్పుడు మూడు కోట్ల టన్నుల దాన్యం పండుతుందని , పాలమూరు ప్రాజెక్టును( Palamuru Project ) పూర్తి చేసి ఇంకో లక్ష ఎకరాలకు నీరు అందిస్తామంటూ ఆయన చెప్పుకొచ్చారు.24 గంటల కరెంటు ఇస్తే కాంగ్రెస్ కండువా వీడి బారాస కండువా కప్పుకుంటానని జానారెడ్డి( Janareddy ) చెప్పారని, చేసి చూపిన తర్వాత ఆయన వెనకడుగు వేశారంటూ చెప్పుకొచ్చారు.తెలంగాణ ఏర్పాటు తర్వాత తెలంగాణ అంధకారంలోకి వెళ్ళిపోతుందన్న శాపనార్థాలను తిప్పికొట్టి 24 గంటలు కరెంటు ఇచ్చి దేశంలోనే తెలంగాణను దిక్సూచిగా నిలబెట్టుకున్నామని ఈ ప్రయాణం ఆగకూడదంటూ ఆయన చెప్పుకొచ్చారు.

Telangana Will Move Forward With Brs Only Kcr Details, Cm Kcr, Praja Aashirvada
Advertisement
Telangana Will Move Forward With Brs Only KCR Details, Cm Kcr, Praja Aashirvada

ఇంటింటికి నల్లా నీళ్లు ఇస్తున్నామని ధీమాగా చెప్పగలమని, తెలంగాణ సర్వతో ముఖాభివృద్ధి బారాస తోనే సాధ్యమంటూ కేసీఆర్ చెప్పుకొచ్చారు తెలంగాణకు ఎవరు గెలిస్తే మంచి జరుగుతుందో వారిని గెలిపించండి అంటూ ఆయన ప్రజలకు సూచించారు .రైతుబంధు పథకాన్ని( Rythu Bandhu ) దశలవారీగా 16 వేలకు పెంచుతామని ఆయన చెప్పుకొచ్చారు.పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకం పై 105 కేసులు వేసి ఆపు చేసిన కాంగ్రెస్ వాళ్లు రైతు సంక్షేమం గురించి మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

ప్రజాస్వామ్యం లో వోటు( Vote ) చాలా శక్తివంతమైన ఆయుధం అని ఆలోచించి వోటు వేయాల్సిందినగా ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు