సండ్ర వీరయ్య టీఆర్ఎస్ లో చేరే తేది ఇదేనా..? మరి మంత్రి పదవి...?

కొద్ది రోజులుగా ఖమ్మం జిల్లా పాలిటిక్స్ లో హాట్ టాఫిక్ గా మారిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పార్టీ మారుపుపై అనేక వార్తలు వెలువడుతూనే ఉన్నాయి.

టీడీపీకి వీర విధేయుడిగా ఉన్న సండ్ర టీఆర్ఎస్ లో చేరేందుకు కాస్త వెనుకా ముందు ఆడుతున్నాడు.

పార్టీ మారడం అయితే మాత్రం కన్ఫర్మ్ అయిపోయింది.దీనికి ఈ నెల 26 వ తేదీన ముహూర్తం కూడా పెట్టుకున్నట్టు సమాచారం.

టీఆర్ఎస్‌లో చేరితే సండ్రకు మంత్రి పదవిని ఇస్తామని కేసీఆర్ కూడా హామీ ఇచ్చినట్టు జోరుగా ప్రచారం కూడా సాగుతోంది.

ముందుగా.సండ్రను ఒప్పించేందుకు అదే జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎంపీలు చర్చలు జరిపినట్టు సమాచారం.ఈ చర్చల సమయంలో పార్టీ మారేందుకు సండ్ర సానుకూలంగా స్పందించలేదని సమాచారం.

Advertisement

దీంతో ఈ సమాచారం తెలిసిన వెంటనే సీఎం కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగినట్టు ప్రచారం సాగుతోంది.నేరుగా సండ్రతో కేసీఆర్ మాట్లాడి.మంత్రి పదవిని ఇస్తామని కూడ హామీ ఇచ్చినట్టుగా ఖమ్మం జిల్లాలో ప్రచారం ఊపందుకుంది.

Advertisement

తాజా వార్తలు