తెలంగాణలో అదే జరగబోతుందా ?

తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం వచ్చే ఛాన్స్ కనిపించడం లేదనేది చాలమంది అభిప్రాయం.

ఈ నేపథ్యంలో హంగ్ పై రాజకీయ వర్గాల్లో చర్చ గట్టిగానే జరుగుతోంది.

మరి హంగ్ వస్తే వాట్ నెక్స్ ? అనే ప్రశ్నలు అత్యంత ఆసక్తికరంగా మారాయి.అయితే ఒకవేళ హంగ్ వస్తే బి‌ఆర్‌ఎస్ మరియు ఏంఐఏం బీజేపీ పార్టీలు( BJP ) కలిసి ప్రభుత్వాన్ని స్థాపించే అవకాశం ఉందనేది కొందరి అభిప్రాయం.

అయితే మొదటి నుంచి కూడా పరస్పర విముఖత చూపిన బీజేపీ మరియు బి‌ఆర్‌ఎస్ పార్టీలు పొత్తుకు ఒకే చెబుతాయా అంటే డౌటే అంటున్నారు విశ్లేషకులు.

ఈ నేపథ్యంలో రాష్ట్రపతి పాలన వచ్చే ఛాన్స్ ఉందనేది మరికొందరి వాదన.కాంగ్రెస్, బి‌ఆర్‌ఎస్, బీజేపీ పార్టీలలో( Congress BRS BJP ) ఏ పార్టీ కూడా మ్యాజిక్ ఫిగర్ 60 సీట్లను సొంతం చేసుకొనిపక్షంలో పొత్తులు కీలకంగా మారతాయి.అయితే పొత్తులు కూడా కుదరనప్పుడు రాష్ట్రపతి పాలన వైపు అడుగులు పడే అవకాశం లేకపోలేదు.

Advertisement

తెలంగాణలో హంగ్ ఏర్పడితే రాష్ట్రపతి పాలనక సిఫారసు చేస్తామని గతంలోనే బీజేపీ నేతలు ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు కూడా.ప్రస్తుతం ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన ఫలితాల ప్రకారం బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు.

అందువల్ల రాబోయే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రపతి పాలన కొరేందుకు అడుగులు వేస్తున్నట్లు పోలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.మరి నిజంగానే తెలంగాణలో రాష్ట్రపతి పాలన వచ్చే ఛాన్స్ ఉందా అంటే విశ్లేషకులు సైతం భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం విన్నింగ్ పై కాంగ్రెస్( Congress ) మరియు బి‌ఆర్‌ఎస్ పార్టీలు( BRS ) ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాయి.

ఈ రెండు పార్టీలకు మ్యాజిక్ ఫిగర్ దక్కని పక్షంలో రాష్ట్ర రాజకీయాలు మరింత రసవత్తరంగా మారే ఛాన్స్ ఉందనేది విశ్లేషకుల అంచనా.మరి క్షణ క్షణం ఉత్కంఠ రేపుతున్న తెలంగాణ రాజకీయాల భవిష్యత్ ఎంటనేది రేపటితో తేలిపోనుంది.

మరి తెలంగాణ ప్రజానీకం ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.

jamuna, Relangi : రేలంగి మాటలకు హీరోయిన్ జమున జంప్..కారణం ఏంటి ?
Advertisement

తాజా వార్తలు