Telangana Legislative Council : మరోసారి వాయిదాపడ్డ తెలంగాణ శాసనమండలి..!!

తెలంగాణ శాసన మండలి( Telangana Legislative Council ) మరోసారి వాయిదా పడింది.

మండలి సభ్యులపై చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy ) క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు( BRS MLCs ) నిరసనకు దిగారు.

ఈ క్రమంలోనే మరోసారి ఛైర్మన్ పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళన కొనసాగించారు.ఈ నేపథ్యంలోనే మండలి కార్యక్రమాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని ఛైర్మన్ విజ్ఞప్తి చేసినప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు శాంతించలేదు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందేనని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.దీంతో శాసనమండలిని ఛైర్మన్ మరోసారి వాయిదా వేశారు.అయితే మండలి సభ్యులపై సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.

The Foods That Help To Kill Breast Cancer Details
Advertisement

తాజా వార్తలు