Telangana Congress : లోక్‎సభ ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్ ఫోకస్..!!

లోక్‎సభ ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్( Telangana Congress ) ఫోకస్ పెట్టింది.ఎంపీ అభ్యర్థుల ఎంపికతో పాటు నామినేటెడ్ పదవుల భర్తీపై కసరత్తు చేస్తోంది.

ఈ మేరకు ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్( KC Venugopal ) తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.

నామినేటెడ్ పోస్టుల్లో ముఖ్యమైన నేతలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే లోక్‎సభ ఎన్నికల్లో( Lok Sabha elections ) గెలుపు గుర్రాలకే టికెట్ కేటాయించాలని పార్టీ హైకమాండ్ భావిస్తోందని సమాచారం.అయితే మంత్రి వర్గ విస్తరణ వ్యవహారాన్ని కాంగ్రెస్ అధిష్టానం ప్రస్తుతానికి పక్కన పెట్టింది.

పార్లమెంట్ ఎన్నికలు పూర్తయిన తరువాత మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉంది.

Advertisement
తెలివితేటల్లో ఐన్‌స్టీన్‌నే మించిపోయిన భారత సంతతి బాలుడు.. వయసు పదేళ్లే!

తాజా వార్తలు