నాయకులకు 'ఫోన్' ఫీవర్ ! హరీష్ రావు హావ తగ్గడానికి కారణం ఇదేనా ..?

రాజకీయ నాయకులు తమ పార్టీయే గురించి , నాయకుల గురించి తమ సన్నిహితుల దగ్గర ఆఫ్ ది రికార్డ్ గా ఎన్నో విషయాలు ఫోన్ లో మాట్లాడుతుంటారు.

అసలే ఎన్నికల సమయం దగ్గరకు వస్తున్న తరుణంలో అయితే వారి ఫోన్ లకు ఖాళీ ఉండదు.

ఏదో ఒక విషయం పై ఎవరో ఒకరితో మాట్లాడుతూనే ఉంటారు.అయితే ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడంలేదు.

ఫోన్ లో ఏదైనా ముఖ్య విషయం గురించి మాట్లాడాలంటే నాయకులు వణికిపోయే పరిస్థితికి వచ్చేసింది.దీనికి కారణం ఆ పార్టీ ఈ పార్టీ అనే బేధం లేకుండా అందరి ఫోన్లపై నిఘా ఉందని ఫోన్ కాల్స్ ట్యాప్ అవుతున్నాయని తెలియడంతో నాయకులు బెంబేలెత్తిపోతున్నారు.

తెలంగాణాలో నాయకుల ఫోన్ లు ట్యాప్ అవుతున్నాయని విపక్ష నేతలు ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి చెబుతున్నారు.టీఆర్ఎస్ నేతలు మాత్రం చెప్పుకోలేకపోతున్నారు.కానీ తమ మాటలు అన్నీ ఎప్పటికప్పుడు రికార్డయి చేరాల్సిన వారికి చేరుతున్నాయని.

Advertisement

తర్వాత జరుగుతున్న పరిణామాలను బట్టి వారు అంచనా వేసుకుంటున్నారు.ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేస్తోందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటే అదేమీ లేదని చెబుతున్న టీఆర్ఎస్ నాయకులు సైతం లోలోపల ఆందోళన చెందుతున్నారట.

మీరు పైకి చెప్తున్నారు మేము ఎవరికీ చెప్పుకోలేకపోతున్నాం అంటూ వారు వ్యక్తిగతంగా కలిసినప్పుడు చెబుతున్నారట.

డీఎస్ కాంగ్రెస్‌తో మంతనాలు జరుపుకుంటున్న ట్యాపింగ్ ద్వారానే తెలిసిందని.టీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్నారు.అలాగే హరీష్ రావును దూరం పెట్టడానికి కూడా కారణం ఇదేనంటున్నారు.

ఫోన్ ట్యాపింగ్ కు అవకాశం ఉండదని కొంత కాలం నుంచి ఇంటర్నెట్, వాట్సప్ కాల్స్ లో మాట్లాడుకుంటున్నారు.కానీ తెలంగాణ నిఘా విభాగం అధికారులు వాట్సాప్ కాల్స్ ను కూడా ట్యాపింగ్, ట్రాకింగ్ చేసే టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చుకున్నారు.దీని కోసం ఏకంగా రూ.70కోట్లు ఖర్చు పెట్టారన్న ప్రచారం జరుగుతోంది.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
Advertisement