తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం కీలక వ్యాఖ్యలు

టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చాలని కొందరు ఆశపడుతున్నారని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు.

తమ ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ వారి ఆశ మాత్రం నెరవేరనివ్వమన్నారు.

తెలంగాణ ఎమ్మెల్యేలు ఎవరూ డబ్బులకు అమ్ముడు పోరని చెప్పారు.ఎమ్మెల్యేల కొనుగోళ్లతో ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.

తన నియోజకవర్గంపై కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.దేశానికి కేసీఆర్ నాయకత్వం అవసరం ఉందని చెప్పారు.

ఆరోపించేవాడు కాదు.ఆలోచించే వాడు పరిపాలన చేస్తారని స్పీకర్ వెల్లడించారు.

Advertisement
God Of Coins Player Safety And Responsible Gambling (UK)