మునగ పంటలో అధిక దిగుబడి పెంచేందుకు పాటించాల్సిన మెళుకువలు..!

మునగ పంట ( drumstick crop )ఉష్ణ మండలపు పంట, పొడి, వేడి వాతావరణం ఈ పంట సాగుకు చాలా అనుకూలం.అధిక చలి మంచు ఉంటే ఈ పంట తట్టుకోలేదు.

30 నుంచి 35 డిగ్రీల మధ్య ఉండే పగటి ఉష్ణోగ్రత ఈ మునగ పంట సాగుకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది.ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు మించితే మునగ పూత రాలిపోతుంది.

అధిక సేంద్రియ పదార్థం ఉండే ఇసుక నేలలు ఈ పంట సాగుకు చాలా అనుకూలం.నేల యొక్క పీహెచ్ విలువ 6-7( pH value is 6-7 ) ఉంటే మంచి దిగుబడులు పొందవచ్చు.

మునగ పంట నాటుకునే పొలాన్ని ముందుగా వేసవికాలంలో లోతు దుక్కులు దున్ని, ఆఖరి దుక్కిలో ఎకరాకు 10 టన్నుల చొప్పున పశువుల ఎరువు ( Cattle manure )వేసి పొలాన్ని కలియ దున్నుకోవాలి.ఇక మునగ చెట్టు నాటే గుంతలో 10 కిలోల పశువుల ఎరువుతో పాటు 250 గ్రాముల వేప పిండి, 250 గ్రాముల సూపర్ ఫాస్పేట్ ఎరువులు వేయాలి.

Advertisement
Techniques To Be Followed To Increase High Yield In Drumstick Crop , Drumstick C

మునగ చెట్లు నాటిన 3,6,9 నెలలకు ఒక్కో ముక్కకు 10 గ్రాముల యూరియా, 75 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ( Murate of Potash )ఎరువులను అందించి నీటి తడి అందించాలి.

Techniques To Be Followed To Increase High Yield In Drumstick Crop , Drumstick C

మునగ చెట్టుకు అధికంగా కొమ్మలు వచ్చి, చెట్టు గుబురుగా పెరగాలంటే.మొక్కలు మూడు అడుగుల ఎత్తు పెరిగిన తర్వాత కొన చివరలను తుంచి వేయాలి.పక్క కొమ్మలు కూడా ఒకటి లేదా రెండు అడుగులు పెరిగే లోపల మళ్లీ చిగుర్లు తుంచి వేయాలి.

ఇలా చేస్తే పక్క కొమ్మలపై చిరుకొమ్మలు ఎక్కువగా పుట్టుకొచ్చి మొక్క గుబురుగా పెరుగుతుంది.ఇలా చిరుకొమ్మలు తుంచి వేయడాన్ని పించింగ్ అంటారు.ఈ పించింగ్ వల్ల అధిక దిగుబడి పొందవచ్చు.

Techniques To Be Followed To Increase High Yield In Drumstick Crop , Drumstick C

మునగ పంటలో అంతర పంటలు సాగు చేయాలనుకుంటే.మొక్కలు వరుసల మధ్య పది అడుగుల దూరం ఉండేటట్లు నాటుకోవాలి.ముల్లంగి, క్యారెట్, బెండ లాంటి పంటలను అంతర పంటగా సాగు చేసి అదనపు ఆదాయం పొందవచ్చు.

Advertisement

తాజా వార్తలు