రబీలో ఉల్లి నారుమడి పెంపకంలో మెళుకువలు..!

ఉల్లి సాగుకు కాలాలతో సంబంధం లేకుండా ఏడాది పొడుగునా సాగు చేయవచ్చు.కాకపోతే రబీలో సాగు చేస్తే మంచి నాణ్యత, అధిక దిగుబడి సాధించడానికి వీలుంటుంది.

ముఖ్యంగా రబీ లో సాగు చేస్తే వాతావరణం ఉల్లి పంట( Onion crop )కు చాలా అనుకూలంగా ఉంటుంది.ఉల్లి సాగు చేసే రైతులు ( Farmers )మొదట శ్రద్ధ పెట్టాల్సింది ఉల్లి నారుమళ్ళ పెంపకం పై.కాబట్టి ఉల్లినారు పెంపకంలో పాటించాల్సిన పద్ధతులు ఏమిటో తెలుసుకుందాం.

Techniques In The Cultivation Of Onions And Garlic In Rabi , Onion Cultivation

రబీ పంటకాలం అంటే నవంబర్ నుండి ఏప్రిల్ వరకు నాటుకొని సాగు చేయవచ్చు.నీటి వసతి ఉండే ప్రాంతాల్లో సాంప్రదాయ పద్ధతులకు తోడుగా శాస్త్రీయతను జోడించి కొన్ని సూచనలు పాటించి నారును పెంచితే ఆరోగ్యమైన నారు పొందవచ్చు.ఒక ఎకరం పొలానికి దాదాపుగా నాలుగు కిలోల విత్తనాలు( Seeds ) అవసరం.

నారు పెంపకానికి ఎత్తైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవాలి.నీరు నిల్వ ఉంటే నారు కుళ్లిపోయే అవకాశం ఉంది.

Advertisement
Techniques In The Cultivation Of Onions And Garlic In Rabi , Onion Cultivation

కాబట్టి ఎత్తైన ప్రదేశాలలో నారు పెంపకం చేయాలి.

Techniques In The Cultivation Of Onions And Garlic In Rabi , Onion Cultivation

ముందుగా నారు పెంచే స్థలాన్ని మూడు లేదా నాలుగు సార్లు బాగా దుక్కి దున్నుకోవాలి.ఒక్కొక్క నారుమడి ఒక మీటరు వెడల్పు, మూడు మీటర్ల పొడవు, 15 సెంటీమీటర్ల ఎత్తు ఉండే విధంగా తయారు చేసుకోవాలి.రెండు నారుమడిల మధ్య కనీసం ఒక అడుగు దూరం ఉండేలా నారుమళ్లు తయారు చేయాలి.ఒక ఎకరాకు సరిపడే నారును 250 చదరపు మీటర్ల స్థలంలో పెంచిన నారు సరిపోతుంది.50% నీడనిచ్చే షెడ్ నెట్ లను ఉపయోగిస్తే మొలక శాతం బాగుంది నాణ్యమైన, ఆరోగ్యకరమైన నారు పొందవచ్చు.విత్తనాలను ( Seeds )ముందుగా మూడు గ్రాముల కాఫ్టాన్( Kaftan ) తో విత్తన శుద్ధి చేసుకోవాలి.

నారుమళ్ళలో ఎప్పటికప్పుడు కలుపు ను నివారించడంతోపాటు నేలలోని తేమశాతాన్ని బట్టి నీటి తడులు అందించాలి.

తెలంగాణ రేషన్ లో ప్లాస్టిక్ బియ్యం.. నిజమెంత?
Advertisement

తాజా వార్తలు