'అలిపిరికి అల్లంత దూరంలో " టీజర్ విడుదల

కాస్కేడ్ పిక్చర్స్ పతాకంపై నూతన నటుడు రావణ్ నిట్టూరు కధానాయకుడిగా రమేష్ డబ్బుగొట్టు, రెడ్డి రాజేంద్ర పి నిర్మిస్తున్న చిత్రం అలిపిరికి అల్లంత దూరంలో.స్టార్ డైరెక్టర్ నందిని రెడ్డి వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన ఆనంద్ జె ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

రాబరీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం టీజర్ విడుదలైయింది.నిమిషం 30 సెకన్లు నిడివి గల టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది.

టీజర్ లో కథా నేపధ్యాన్ని చాలా ఆసక్తికరంగా రివిల్ చేశాడు దర్శకుడు.తిరుపతిలో ఫోటోల షాపు పెట్టుకోవాలని తపించే హీరో, అతనికి ఒక అందమైన ప్రేమ కథ, సరదగా సాగిపోతున్న అతని జీవితాన్ని ఒక మనీ బాగ్ ఊహించని మలుపు తిప్పుతుంది.

ఈ క్రమంలో వచ్చిన సంఘటనలు కథపై చాలా క్యూరీయాసిటీని పెంచాయి.రావణ్ అద్భుతమైన నటన కనబరిచారు.

Advertisement

టీజర్ లో కనిపించిన మిగతా నటీనటులంతా చక్కని అభినయం కనబరిచారు.టీజర్ ఫణి కళ్యాణ్ అందించిన నేపధ్య సంగీతం బ్రిలియంట్ గా వుంది.

డిజికె కెమరాపనితనం డీసెంట్ గా వుంది.తిరుపతి నేపధ్యంలో వస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు వున్నాయి.

ఇప్పటికే విడుదలై “మా తిరుపతి” పాటకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది.మా తిరుపతి పాట రిలీజ్ అయిన రోజు నుండి వరుసగా 12 రోజులు టాప్ ట్రెండింగ్ లో ఉంటూ 30 లక్షలు పైన వ్యూస్ ని సాధించి చార్ట్ బస్టర్ హిట్ గా నిలిచింది.

నూతన దర్శకుడు ఆనంద్ తన తొలి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేక మార్క్ చూపించబోతున్నారని ప్రమోషనల్ మేటీరియల్ చూస్తే అర్ధమౌతుంది.ఇప్పటికే మా తిరుపతి పాటతో అందరినీ ఆకర్షించిన ఈ చిత్రం ఇప్పుడు ఇంట్రస్టింగ్ టీజర్ తో మరిన్ని అంచనాలని పెంచింది.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich

నూతన నటీనటులతో నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీ నికిత, అలంకృత షా, బొమ్మకంటి రవీందర్, అమృత వర్షిణి సోమిశెట్టి లహరి గుడివాడ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Advertisement