ఎన్నికలకు టీడీపీ దూరం... బీఆర్ఎస్ కు అలా కలిసొచ్చిందిగా 

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడం అధికార పార్టీ బీఆర్ఎస్ కు బాగా కలిసి వచ్చింది .

తెలంగాణ ఎన్నికల్లో సత్తా చాటుకుని మూడోసారి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోవాలని భావిస్తున్న బీఆర్ఎస్ దానికి అనుగుణంగానే భారీగా పార్టీలోకి చేరికలు ఉండేలా చూసుకుంటుంది.

ఎంత ఎక్కువ చేరికలు ఉంటే అంతగా పార్టీ బలోపేతమై ఎన్నికల్లో సత్తా చాటుకుంటుందనే ఆలోచనతో బీఆర్ఎస్ అధిష్టానం ఉంది.కేసీఆర్( CM kcr ) దగ్గర నుంచి ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు , సామాన్య కార్యకర్తల వరకు నిత్యం ఎన్నికల ప్రచారంలోని నిమగ్నం అయ్యారు.

ప్రజలను ప్రసన్నం చేసుకునే విధంగా ప్రసంగాలు చేస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

 తెలంగాణలోని అన్ని పార్టీల లోని అసంతృప్తి నేతలు,  కీలక నాయకులను గుర్తించి వారితో మంతనాలు చేసి పార్టీలో చేరే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.దీనిలో భాగంగానే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పైన బీఆర్ఎస్ ( BRS )కన్నీ కన్నేసింది.ఎన్నికల్లో ఆ పార్టీ పోటీకి దూరంగా ఉండడంతో,  ఆ పార్టీ నుంచి పోటీ చేయాలని భావించిన సీనియర్ నేతలు అసంతృప్తికి గురవడంతో,  వారిని తమ పార్టీలో చేర్చుకునే వ్యూహానికి బీఆర్ ఎస్ తెర తీసింది.

Advertisement

టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టు సమయంలో కేటీఆర్ తో పాటు,  బీఆర్ఎస్ నాయకులు కొంతమంది చేసిన వ్యాఖ్యలు కమ్మ సామాజిక వర్గంలో ఆగ్రహం కలిగించడంతో వారంతా బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మారారని గుర్తించిన కేసీఆర్ , ఇప్పుడు అదే టిడిపి నుంచి పెద్ద ఎత్తున చేరికలు ఉండేలా చూసుకుంటున్నారు.దీని ద్వారా మిగిలిన క్యాడర్ ను కూడా తమ వైపుకు తిప్పుకోవచ్చనే ఆలోచనతో ఉన్నారట.

ఇటీవల తెలంగాణ టిడిపి అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన కాసాని జ్ఞానేశ్వర్( Kasani gnaneswar ) ను  బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు.జ్ఞానేశ్వర్ తో పాటు, రాష్ట్ర, జిల్లాల కార్యవర్గం కూడా ముక్కుముడిగా పార్టీలో చేర్చుకున్నారు.తెలంగాణలో టిడిపి పోటీ చేసే ఆలోచన లేకపోవడంతో , ఇక పార్టీలో ఉన్నా ఉపయోగం ఏమిటనే అభిప్రాయంతో ఉన్న నేతలను గుర్తించి , వారిని బీఆర్ఎస్ లో చేర్చుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు .ఈ విధంగా తెలంగాణ టిడిపి కి చెందిన నాయకులను పూర్తిగా బీఆర్ఎస్ లో చేర్చుకునే విధంగా కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు.

ఏంటి బాబులు హ్యాంగోవరా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!
Advertisement

తాజా వార్తలు