ఆ నినాదంతో టీడీపీ జనసేన పోరాటం ? పొత్తు కోసమేనా ? 

ఏపీలో తెలుగుదేశం పార్టీ రాజకీయాలు ఎటు నుంచి ఎటు తిరిగినా, చివరకు జనసేన పార్టీతో పొత్తు అంశం చుట్టూనే తిరుగుతున్నాయి.

ఆ పార్టీతో ఏదో రకంగా పొత్తు పెట్టుకునేందుకు తెలుగుదేశం పార్టీ ఆరాట పడుతూ వస్తోంది.

ఒంటరిగా 2024 ఎన్నికలకు వెళితే మళ్లీ ఘోర పరాజయం తప్పదని ఆందోళన ,ఆ పార్టీలో కనిపిస్తోంది అందుకే ఏదో రకంగా బిజెపితో పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తూ వస్తోంది.కానీ టీడీపీతో ఎట్టిపరిస్థితుల్లోనూ పొత్తు పెట్టుకునేది లేదు అంటూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తో పాటు బిజెపి జాతీయ నేతలు ఇప్పటికే ప్రకటన చేయడంతో బాబు బిజెపి విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు.

ఇక తమతో సన్నిహితం గా వ్యవహరిస్తారని పేరున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఒప్పించి 2024 నాటికి జనసేన తో పొత్తు పెట్టుకోవాలి అనేది టిడిపి ప్లాన్.బిజెపి జనసేన మధ్య విభేదాలు ఎలా అయినా వస్తాయని , అవి తమకు కలిసి వస్తాయనే విధంగా టిడిపి అంచనా వేస్తోంది.

అయితే జనసేనకు దగ్గర అయ్యే విధంగా ఏదో ఒక అంశం తో ముందుకు వెళ్లాలనే వ్యూహాన్ని టిడిపి ఇప్పుడు అమలు చేయబోతోంది.ప్రత్యేక హోదా , విభజన హామీల సాధన విషయంలో పోరాటం చేపడతాం అంటూ ఇప్పటికే ఆంధ్ర మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ చెబుతున్నారు.

Advertisement
Dp Trying To Form An Alliance With Janasena Party TDP, Janasena, Bjp, Pavan Kaly

అయితే ఆయన వెనుక టిడిపి ఉందనే విషయం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.చలసాని శ్రీనివాస్ ఉద్యమం చేపడితే , అందులోకి టిడిపి ,జనసేన వెళ్లడమే కాకుండా , అటు కేంద్రం పైన ఇటు ఏపీ ప్రభుత్వం పైన తీవ్రస్థాయిలో ఒత్తిడి పెంచాలని విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఇదే చలసాని శ్రీనివాస్ యాదవ్ ఇవే అంశాలపై ఉద్యమాన్ని చేపట్టారు.అప్పుడు వైసిపి ని రాజకీయంగా ఉపయోగించుకుని సక్సెస్ అయ్యింది.

Dp Trying To Form An Alliance With Janasena Party Tdp, Janasena, Bjp, Pavan Kaly

ఇప్పుడు అదే ఫార్ములాను ఉపయోగించి తాము సక్సెస్ అవ్వాలనే విధంగా టిడిపి ప్లాన్ చేస్తోంది.పనిలో పనిగా జనసేన తో పొత్తు కూడా కుదిరే అవకాశం ఉంటుందనేది బాబు ప్లాన్ గా కనిపిస్తోంది .ఒకేసారి బిజెపిని వైసిపిని ఇరుకున పెట్టడంతోపాటు, జనసేన పార్టీకి దగ్గర అయ్యేందుకు ఇదే మంచి మార్గంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది.ఏదో రకంగా ఎన్నికల నాటికి జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుంటామనే ధీమా ప్రస్తుతం టీడీపీ నేతల్లో కనిపిస్తోంది.

తాజా వార్తలు