ఏపీ గవర్నర్ ను కలవనున్న టీడీపీ బృందం

ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను టీడీపీ నేతల బృందం కలవనుంది.ఈ మేరకు ఇవాళ సాయంత్రం గవర్నర్ తో పార్టీ నాయకులు భేటీ కానున్నారు.

ఏపీలో శాంతిభద్రతలతో పాటు చెరుకుపల్లిలో ఇటీవల చోటుచేసుకున్న బాలుడి హత్యపై టీడీపీ నేతలు గవర్నర్ అబ్దుల్ నజీర్ కు ఫిర్యాదు చేయనున్నారని తెలుస్తోంది.అదేవిధంగా రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులపై కూడా కంప్లైంట్ ఇవ్వనున్నారు.

నిందితులపై కఠిన చర్యలు తీసుకునే విధంగా గవర్నర్ చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతల బృందం కోరనుందని సమాచారం.

Advertisement

Latest Latest News - Telugu News