టీడీపీ ప్రజలను రెచ్చగొడుతుంది.. మంత్రి అంబటి విమర్శలు

పల్నాడు జిల్లా మాచర్ల ఘటనలో గాయపడిన వారిని మంత్రి అంబటి రాంబాబు పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇదేం కర్మ పేరుతో టీడీపీ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు.

మాచర్ల నియోజకవర్గంలో అశాంతిని నెలకొల్పేందుకు ఫ్యాక్షన్ మనస్తత్వం ఉన్న బ్రహ్మారెడ్డిని చంద్రబాబు పంపించారని ఆరోపించారు.రామకృష్ణారెడ్డిని, వెంకటరామిరెడ్డిని అంతం చేసేందుకు కుట్ర పన్నారన్నారు.

పిన్నెల్లిని ఓడించడం చేతకాకే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Kirol Bet Bonuses And Promotions : A Value Assessment For Experienced Players
Advertisement