జగన్ ను ఇరుకున పెట్టేందుకు ఏం చేసేందుకైనా బాబు సిద్దం!

ఏపీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డిని( CM Jagan Mohan Reddy ) ఇరుకున పెట్టే ఏ ఒక్క మార్గంను తెలుగు దేశం పార్టీ చంద్రబాబు నాయుడు వదిలి పెట్టే పరిస్థితి కనిపించడం లేదు.

ఇటీవల ఢిల్లీ వెళ్లి బీజేపీ నాయకులతో చంద్రబాబు నాయుడు చర్చలు జరిపిన విషయం తెల్సిందే.

తెలుగు దేశం పార్టీ తో బీజేపీ పొత్తుకు నో అంటే వైకాపా ఆ పొత్తును కోరుకుంటుంది అంటూ ప్రచారం జరిగింది.

వైకాపా నాయకులు బీజేపీ ( BJP )తో సన్నిహిత్యంగా ఉంటున్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తానే రెండు మూడు మెట్లు కిందికి దిగి అన్నట్లుగా బీజేపీ నాయకులను కలవడం జరిగింది.ఢిల్లీ లో చంద్రబాబు నాయుడు జరిపిన రాజకీయ చర్చలతో మొత్తం ఏపీ రాజకీయం మొత్తం మారిపోయింది.ఏపీలో తెలుగు దేశం పార్టీ తో ఇప్పటికే జనసేన ( Janasena )పొత్తుకు ఆసక్తి చూపిస్తోంది.

కానీ బీజేపీ మాత్రం ఇన్నాళ్లు ఆసక్తి చూపించలేదు.కానీ చంద్రబాబు నాయుడు స్వయంగా వెళ్లి నడ్డా మరియు అమిత్ షా( Amit Shah ) లను కలిసి చర్చలు జరపడం వల్ల మొత్తం రాజకీయ ముఖ చిత్రం మారిపోయే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి.

Advertisement

ఇదే సమయంలో జగన్‌ యొక్క వ్యూహాలు ఎలా ఉంటాయి అనేది ఆసక్తిని కలిగిస్తోంది.

ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు గాను జగన్ కసరత్తు చేస్తున్నాడు అంటూ పుకార్లు షికార్లు చేశాయి.కానీ ఇప్పటి వరకు వైకాపా నాయకులు ఎవరు కూడా ఆ విషయాన్ని బయటకు చెప్పేందుకు ఆసక్తి చూపించడం లేదు.అయితే తెలుగు దేశం పార్టీ నాయకులు మాత్రం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి అంటూ ప్రచారం చేస్తున్నారు.

ప్రతి ఒక్క విషయంలో కూడా చంద్రబాబు నాయుడు మరియు తెలుగు దేశం పార్టీ నాయకులు వైకాపా ను ఇరుకున పెట్టి జనాల వద్ద కార్నర్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తాజా రాజకీయ పరిణామాలు చూస్తూ ఉంటే అనిపిస్తోంది.

కొద్ది పాటి చ‌లికే వ‌ణికిపోతున్నారా? అయితే మీరివి తెలుసుకోవాల్సిందే!
Advertisement

తాజా వార్తలు