నంద్యాలలో టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశం

టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీ సీఐడీ పోలీసులు నంద్యాలలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో నంద్యాల వేదికగానే రాజకీయ కార్యాచరణకు పార్టీ శ్రేణులు రంగం సిద్ధం చేస్తున్నారు.

ఇందులో భాగంగా నంద్యాలలో టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశం జరుగుతోంది.దీనికి ఢిల్లీ నుంచి లోకేశ్ వర్చువల్ విధానంలో హాజరయ్యారని తెలుస్తోంది.

రాజకీయ కార్యాచరణను చర్చిస్తున్న పార్టీ నేతలు నారా లోకేశ్ నిర్వహించే యువగళం పాదయాత్ర తేదీని కూడా ప్రకటించే అవకాశం ఉంది.అదేవిధంగా ఏపీలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి ముందుకు ఏ విధంగా వెళ్లాలనే దానిపై చర్చించనున్నారు.

చంద్రబాబు అరెస్ట్ తో పాటు టీడీపీ కార్యకర్తలపై ప్రభుత్వం నమోదు చేస్తున్న కేసులపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు