వైసీపీ ఎత్తుకు ఊహించ‌ని ఎత్తుతో చెక్ పెట్టిన టీడీపీ ఎమ్మెల్యే...!

రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థి పార్టీని ఎదుర్కొనేందుకు దీటుగా రాజ‌కీయాలు చేయాలి.అయితే.

అధికార వైసీపీ మాత్రం దొడ్డిదారులు, దొంగ‌దారులు వెతుక్కుంటోంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా టీడీపీ నాయ‌కులు బ‌లంగా ఉన్న చోట‌ వైసీపీ ఎత్తుగ‌డ‌లు జుగుప్సాక‌రంగా ఉన్నాయి.

ప్ర‌కాశం జిల్లా ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గాన్ని తీసుకుంటే.ఇక్క‌డ టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబ‌శివ‌రావు బ‌లంగా ఉన్నారు.

ఇక‌, వైసీపీ ఇంచార్జ్‌గా రావి రామ‌నాథం బాబు చ‌క్రం తిప్పుతున్నారు.ప్ర‌జ‌ల్లో ఏమాత్రం బ‌లం లేని ప‌రుచూరు వైసీపీ నాయ‌క‌త్వం టీడీపీ ఎదుర్కొనే స‌త్తాలేక‌ జిమ్మిక్కుల‌కు తెరదీసింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

Advertisement

ఆ మాట‌కు వ‌స్తే రావి నాయ‌క‌త్వంపై వైసీపీ నాయ‌క‌త్వానికే ఇక్క‌డ అనుమానాలు ఉన్నాయి.ఈ క్ర‌మంలో టీడీపీ అభ్య‌ర్థిని తాజాగా కిడ్నాప్ చేయ‌డం క‌ల‌క‌లం సృష్టించింది.

విష‌యం తెలిసి.ఎమ్మెల్యే ఏలూరి సాంబ‌శివ‌రావు రంగంలోకి దిగ‌డంతో స‌ద‌రు నాయ‌కుడు సుర‌క్షితంగా బ‌య‌ట ప‌డ్డాడు.

పర్చూరు నియోజకవర్గంలోని పెదగంజాం పంచాయతీ సర్పంచ్‌ పదవికి టీడీపీ మద్దతుతో యాదవ సామాజికవర్గానికి చెందిన యల్లావుల తిరుప తిరావు పోటీకి సిద్ధమయ్యారు.ఎమ్మెల్యే ఏలూరి సూచనతో నామినేషన్‌ వేసే ముందు ఆయన శనివారం ఉదయాన్నే దైవదర్శనానికి వెళ్లారు.

అక్కడి నుంచి తిరుపతి రావు అతనితోపాటు వెళ్లిన మరో నలుగురు టీడీపీ వర్గీయులు కారులో బయ లుదేరారు.వారు కొద్దిదూరం రాగానే వైసీపీకి చెందిన ఆ మండల కన్వీనర్‌ అంకమ్మరెడ్డి, అతని అనుచరులు బైక్‌లపై వెళ్లి కారుని అడ్డగించారు.

కమల్ హాసన్ భారతీయుడు 3 తో మరోసారి నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడా..?
ప్రభాస్ కి అసలైన పోటీ ఇచ్చే స్టార్ హీరోలు వీళ్లేనా..?

కారు ఆగగానే తిరుపతిరావుని పట్టుకుని వారితో పాటు తెచ్చుకున్న కారులో బల వంతంగా ఎక్కించారు.తిరుపతిరావుతోపాటు ఉన్న ఆసోది వెంకటరామి రెడ్డిని కూడా తొలుత బలవంతంగా కారు ఎక్కించారు.ఆ తర్వాత ఆయన వద్ద సెల్‌ తీసుకుని అతనిని వదిలేసి తిరుపతిరావుని కిడ్నాప్ చేశారు.

Advertisement

 ఈ విష‌యం తెలిసిన ఏలూరి  వెంటనే పెదగంజాం చేరుకుని టీడీపీ మద్దతుదారులతో నిరసన చేప‌ట్టారు. కిడ్నాపర్లను అరెస్టు చేయాల‌ని,  తిరుపతిరావుని తమకు అప్పగించాల‌ని డిమాండ్ చేశారు.ఏలూరి చేప‌ట్టిన ఆందోళ‌న‌తో పోలీసులు రంగంలోకి దిగారు.

కేవ‌లం రెండు గంటల వ్యవధిలోనే ఒంగోలు ప్రాంతంలో ఉన్న వైసీపీ నేత అంకమ్మరెడ్డిని, ఆయన వద్ద ఉన్న తిరుపతిరావుని పట్టుకున్నారు.ఈ ప‌రిణామం జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా క‌ల‌క‌లం రేపింది.

ఏదేమైనా వైసీపీ జిమ్మిక్కుల‌కు ఏలూరి చెక్ పెట్ట‌డంతో టీడీపీ అభ్య‌ర్థి నామినేష‌న్ వేసేందుకు మార్గం సుగ‌మ‌మైంది.ఎక్క‌డైనా రాజ‌కీయంగా ఎదుర్కొనే ప్ర‌య‌త్నం చేయాల్సిన నాయ‌కులు ఇలా కిడ్నాప్‌ల‌కు ప్ర‌య‌త్నించారంటేనే వారి ఓట‌మిని అంగీక‌రించిన‌ట్ట‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

తాజా వార్తలు