వైసీపీ ప్రభుత్వానికి సామాజిక సాధికారత బస్సు యాత్ర చేసే నైతిక అర్హత లేదు - నిమ్మల రామానాయుడు

పశ్చిమ గోదావరి జిల్లా: దళితులను, బీసీలను మోసం చేసిన వైసీపీ ప్రభుత్వానికి సామాజిక సాధికారత బస్సు యాత్ర చేసే నైతిక అర్హత లేదని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తీవ్రంగా దుయ్యపట్టారు.

పాలకొల్లులో ఆయన మీడియాతో మాట్లాడుతూ 27 దళిత పథకాలను రద్దు చేసి వారిని ఉద్ధరించినట్టు చెప్పడం సిగ్గుచేటు అన్నారు.

ఎస్సీ బీసీ సబ్ ప్లాన్ ను రద్దు చేసి వారి సామాజిక అభివృద్ధిని నాశనం చేసిన జగన్ ప్రజల ముందు బస్సుయాత్ర చేసే నైతిక హక్కు లేదన్నారు.అంబేద్కర్ విదేశీ విద్యను బెస్ట్ అవెలబుల్ స్కూల్ పథకాన్ని , ఎస్సి , బీసీలకు బ్యాంకు రుణాలు ఇచ్చే కార్పొరేషన్ లను కూడా రద్దు చేయడం జగన్ రాక్షస పాలనకు నిదర్శనం అన్నారు.

Tdp Mla Nimmala Ramanaidu Comments On Ycp Samajika Sadhikara Bus Yatra, Tdp, Mla

దళితులపై బీసీలపై జరుగుతున్న దాడులకు జగన్ ఏమి సమాధానం చెబుతారో ఈబస్సు యాత్రల్లో వివరించాలని కోరారు.

తీవ్రమైన రోగాలతో బాధపడుతున్న తెలుగు హీరోయిన్స్ వీళ్ళే
Advertisement

తాజా వార్తలు