టీడీపీ నేత నిర్వాకం.. మరదలితో అక్రమ సంబంధం

మరదలితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ టీడీపీ నేతకు జైలు శిక్ష పడ్డ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటనలో ఓ టీడీపీ నేతకు ఏకంగా మూడేళ్ల జైలు శిక్ష పడటంతో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.

అనంతపురం జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధి పూర్తి వివరాలు మనం కూడా తెలుసుకుందాం.అనంతపురంలోని బత్తలపల్లి మండలం గంటాపురం గ్రామానికి చెందిన టీడీపీ నేత ఈశ్వర్య్య తన సోదరుడు శ్రీకాంత్ భార్య రాధతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

ఈ విషయం గురించి తెలుసుకున్న శ్రీకాంత్ మనస్థాపానికి గురై ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.దీంతో అతడి సోదరి పోలీసులను ఆశ్రయించింది.

కాగా కేసు విచారణలో పోలీసులు ఈశ్వరయ్య రాధల అక్రమ సంబంధమే శ్రీకాంత్ మరణానికి కారణమని నిర్ధారించారు.దీంతో నిందితుడు ఈశ్వరయ్యతో పాటు రాధకు మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5వేల జరిమానా కూడా పడింది.ప్రజలకు అండగా ఉండాల్సిన నాయకుడు ఇలాంటి నీచానికి ఒడిగట్టడమేంటని అక్కడి ప్రజలు ఈశ్వరయ్యను అసహ్యించుకుంటున్నారు.

Advertisement
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్ 8, బుధవారం 2023

తాజా వార్తలు